తమిళ స్టార్ నటుడు మాధవన్ అతి త్వరలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న రాకేట్రి ః ది నంబి ఎఫెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు సోషల్ మీడియాలో వివాదాస్పదం అయ్యాడు. తమ సినిమా విడుదల సమయంలో హీరోలు పొలిటికల్ అంశాలు మాట్లాడటం ఎంతగా తగ్గిస్తే అంత బెటర్.
మాధవన్ ఆ విషయాన్ని మర్చి పోయాడో లేదా పట్టించుకోలేదో కాని.. తాజాగా ఆయన మోడీ ప్రభుత్వం ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. అధికార పార్టీని మరియు ప్రధానిని ప్రశంసిస్తే కలిసి వస్తుందని.. ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని మాధవన్ భావించాడో ఏమో కాని.. ఇప్పుడు ఆయన్ను సోషల్ మీడియాలో ఒక వర్గం వారు ఆడేసుకుంటున్నారు.
ఇంతకు మాధవన్ చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే... కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో డిజిటల్ మనీని ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరిన సమయంలో చాలా మంది నవ్వుకున్నారు. ఇండియాలో మెజార్టీ భాగం పల్లెటూర్లో ఉంటారు. అక్కడ ఎలా సాధ్యం అవుతుందని అన్నారు. కాని ఇప్పుడు దేశం మొత్తం కూడా డిజిటల్ మనీ వాడుతున్నారు.
మోడీ వల్ల ప్రస్తుతం దేశంలో డిజిటల్ మనీ అత్యధికంగా చలామణి అవుతుందని మాధవన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన ఈ విషయంలో మోడీ ని మరియు ఎన్డీయే ప్రభుత్వం ను అభినందిస్తూ వ్యాఖ్యలు చేయడంను కొందరు తప్పుబడుతున్నారు. మోడీ భక్త్ అంటూ మాధవన్ ను పలువురు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇదే సమయంలో మోడీ అమలు చేస్తున్న పలు ప్రజా వ్యతిరేక విధానాలు మీకు కనిపించడం లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. నోట్ల రద్దు విషయంలో జరిగిన తప్పిదాలను మీరు ప్రశ్నించగలరా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి రాకేట్రి సినిమా విడుదల సమయంలో మోడీ ని స్తుతిస్తూ మాధవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన సినిమా పై కొంత మొత్తంలో అయినా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.