నెప్టోయిజం వ్య‌తిరేకుల‌‌పై ఖాన్ చెల్లెలు ఫిక‌ర్

Update: 2020-07-14 23:30 GMT
సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత నెప్టోయిజంపై ఆస‌క్తిక‌ర డిబేట్ సాగుతోంది. న‌ట‌వార‌సుల వ‌ల్ల‌నే ప్ర‌తిభావంతులైన బ‌య‌టి వాళ్లు ఎద‌గ‌లేక‌పోతున్నార‌న్న ఆరోప‌ణ‌ల ఫ‌ర్వం వేడెక్కించింది. ఖాన్ లు.. క‌పూర్లు.. భ‌ట్స్ కి విమ‌ర్శ‌ల‌ సెగ ఓ రేంజులోనే తాకింది. క‌రీనా క‌పూర్ ఖాన్.. సోన‌మ్ క‌పూర్.. ఆలియా భ‌ట్ .. షాహీన్ భ‌ట్ వంటి వారిపై నెటిజ‌నుల వీరంగం తెలిసిందే. న‌ట‌వార‌సులు అంటూ వీళ్ల‌ను ఓ రేంజులోనే ఆడేసుకున్నారు.

ఇక న‌ట‌వార‌స‌త్వం ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన తొలి హీరో సైఫ్ అలీఖాన్. సుశాంత్ మ‌ర‌ణానంత‌రం ఓ మీడియా లైవ్ చాట్ లోకి వ‌చ్చిన సైఫ్ ఖాన్ దానిని ఖండించారు. వ‌న్ సైడెడ్ గా ఆరోపించ‌డం స‌రికాద‌ని అన్నారు. న‌ట‌వార‌సుల్ని మాత్ర‌మే నిందించ‌డం స‌రికాద‌ని.. ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

ఇప్పుడు ఆయ‌న గారి చెల్లెలు వంతు. సైఫ్ ఖాన్ సోద‌రి సోహా అలీఖాన్ గురించి తెలియ‌నివారు ఉండ‌రు. అప్ప‌ట్లో సౌత్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ తో ఘాటైన ప్రేమాయ‌ణం సాగించిన సోహా అలీఖాన్ ఆ త‌ర్వాత అత‌డికి బ్రేక‌ప్ చెప్పేసి.. బాలీవుడ్ యువ‌హీరో ఖునాల్ ఖీముతో ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఖునాల్ ని పెళ్లాడి ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది సోహా. 40 ప్ల‌స్ లోనూ 20 ఏజ్ సుంద‌రిగా ప‌టౌడీ వార‌సురాలు మెరుపులు మెరిపిస్తుంటుంది.

సోహా అలీ ఖాన్ తాజాగా ఓ చానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ పరిశ్రమలో స్వపక్షవాదం (వార‌స‌త్వం.. మా వాళ్లు) అనేది ఉంద‌ని అది ఇప్పుడే పుట్టిన‌ది కాద‌ని కూడా అంది. స్వపక్షం.. సమాన అవకాశాలు అనే వాటిపై మాట్లాడాల్సి వ‌స్తే ఇవ‌న్నీ గత నెలలో(సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత‌) బ‌య‌ట‌ప‌డ్డ విష‌యాలు కావు. చాలాకాలంగా ఉనికిలో ఉన్న‌వే. ఇవి చిత్ర పరిశ్రమకు లేదా భారతదేశానికి కొత్తేమీ కాదు`` అని అన్నారు.

స్వపక్షం.. అభిమానవాదం అంటే అర్థం ఏమిటో కూడా సోహా చెప్పారు. ఇష్టపడే వారితో పనిచేయడానికి నిర్మాతలు ఆస‌క్తిగా ఉంటే త‌ప్పేమీ కాదు. లేదా ప్ర‌జ‌లు వారి అర్హ‌త‌ని నిర్ణ‌యిస్తారు. అలాంటి వారిని వ్య‌తిరేకించే హ‌క్కు ఎవ‌రికి ఉంది? మీకు అర్హమైన ప్రేమ గౌరవం లభించాక‌ మీకు రావాల్సిన దాన్ని ఎవరైనా తీసుకున్నారని మీరు ఎప్పుడైనా భావిస్తారా? నటీనటులు కెరీర్ వృద్ధి చెందడంలో ప్రేక్షకులే ప్ర‌త్యేక పాత్ర పోషిస్తారు.. అని ఆమె పేర్కొన్నారు.

మీరు(నెటిజ‌నులు.. బాధితులు) ఇతరులను నిందించడం స‌రికాదు. సమస్య వచ్చినప్పుడు ఎవ‌రైనా ఎలాంటి వైవిధ్యం చూపుతారో చూడాలి. ఎవరైనా ఎద‌గాల‌ని.. త‌మ సినిమాల‌ టిక్కెట్లు కొనాలని.. జ‌నాద‌ర‌ణ పొందాల‌ని.. వీటిని మాత్ర‌మే మీరు సోషల్ మీడియాలో రాయండి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వాస్తవానికి ప‌రిశ్ర‌మ‌లో స్వాభిమానవాదం అనేది ఉంది. అది లేదని చెప్పడంలో అర్థం లేదు. కాని నేను సినిమా శక్తులను నమ్ముతాను. అవి విభిన్న‌మైన‌ద‌ని మ‌ర‌వ‌కండి`` అంటూ క్లాస్ తీస్కుంది. సోహా అలీ ఖాన్ - కునాల్ ఖీము జంట `ధూండే రెహ్ జావోగే`.. 99 వంటి చిత్రాలలో కలిసి నటించారు. సైఫ్‌ ఖాన్ న‌టించిన `గో గోవా గాన్` లో కునాల్ అతిధి పాత్రలో నటించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News