మేము బాగానే ఉన్నాం మద్యలో మీ గొడవ ఏంటీః సోహెల్‌

Update: 2020-12-25 14:30 GMT
బిగ్ బాస్ సీజన్‌ విన్నర్‌ అభిజిత్ మరియు టాప్‌ 3 గా నిలిచిన సోహెల్ లు వరుసగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వారు ఎక్కడకు వెళ్లినా కూడా మెహబూబ్ విషయాన్ని ఇంటర్వ్యూ చేస్తున్న వారు తీస్తున్నారు. దాంతో వారిద్దరికి కూడా చిరాకు లేస్తోంది. అభిజిత్ ఇటీవలే ఒక వెబ్‌ మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో వారు ఆ ప్రశ్న అడగడంతో ఎందుకండి పదే పదే ఆ ప్రశ్న అడుగుతారు. డబ్బు విషయం నాకు సమస్య కాదు. నేను విజేతగా నిలిచాను నన్ను అభిజిత్‌ గా గుర్తిస్తున్నారు. డబ్బు నాకు మ్యాటర్‌ కాదు అన్నాడు. తాజాగా అదే వెబ్ మీడియా సంస్థ సోహెల్‌ ను ఇంటర్వ్యూ చేసిన సందర్బంగా కూడా మీరు మెహబూబ్‌ తో కుమ్మక్కు అయ్యి ప్రైజ్‌ మనీ దక్కించుకున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటీ అంటూ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సోహెల్‌ కూడా అసహనం వ్యక్తం చేశాడు.

ఈ విషయాన్ని మరీ ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. నేను అభిజిత్‌ అఖిల్‌ మెహబూబ్‌ అందరం బాగానే ఉన్నాం. మా అ భిమానులు కూడా బాగానే ఉన్నారు. కొందరు చేసినదాన్ని మీడియా వారు మరీ ఎక్కువగా చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను ఇన్‌ స్టా ఫాలోవర్స్ గురించి అడిగాను. ఆ సమయంలో మూడు చూపించాడు. అసలు ఫుటేజ్ ను చూపిస్తే ఏం జరిగింది అనేది తెలుస్తుంది. స్టార్‌ మా వారు ఆ రోజు నేను మెహబూబ్‌ మాట్లాడింది క్లీయర్‌ గా కట్టింగ్‌ లేకుండా చూపించాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. అయినా నేను నెం.2 లో ఆ సమయంలో ఉన్నాను. ఓట్ల సమయంలో చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు. నెం.2 గా ఉన్న నన్ను ఎందుకు వాడు మూడు చూపిస్తాడు. దాంట్లో ఎలాంటి లాజిక్ లేదు. అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు. మేం బాగానే ఉంటే మీరు గొడవ చేస్తున్నారు అంటూ సోహెల్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇకపై అయినా అతడికి ఈ ప్రశ్న గొడవ తప్పుతుందేమో చూడాలి.
Tags:    

Similar News