తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలి బయోపిక్ 'తలైవి' షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. ఇటీవలే కంగనా సౌత్ ఇండియాకు వెళ్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆమె సౌత్ ఇండియాకు వచ్చింది తలైవి షూటింగ్ కోసం అంటూ ఆమె అభిమానులు మరియు బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. ఇలాంటి సమయంలో తలైవి షూటింగ్ ను పూర్తి చేసేందుకు మేకర్స్ సిద్దం అయ్యారు. ఇలాంటి సమయంలో వారికి పెద్ద ఇబ్బందిగా మారిన విషయం ఏంటీ అంటే కంగనా మేకప్. జయలలిత మాదిరిగా కంగనా కనిపించేందుకు గాను హాలీవుడ్ ఫిల్మ్ మేకప్ ఆర్టిస్ట్ గ్యారీ ఓల్డ్ మెన్ ను రప్పించి మేకప్ వేయించారు.
కరోనా కారణంగా ఆయన ఇండియా వచ్చేందుకు సిద్దంగా లేరు. దాంతో ఆయన స్థానంలో ఇండియన్ మేకప్ ఆర్టిస్టుతోనే పని కానివ్వాలని భావించారు. కంగనాకు అమ్మ లుక్ ను తీసుకు వచ్చేందుకు చాలా ఇబ్బంది అవుతుందట. ఆయన రావాల్సిందే అన్నట్లుగా యూనిట్ సభ్యులు ఆలోచనల్లో ఉన్నారు. గ్యారీ ఓల్డ్ మెన్ సినిమా ను మద్యలో వదిలేసి పోయాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. అతడు మళ్లీ వచ్చే వరకు షూటింగ్ ను ఆపేస్తారా లేదంటే ఏదోలా కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.