ఎట్టకేలకు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ''సన్ ఆఫ్ సత్యమూర్తి'' తొలిరోజు కలెక్షన్స్ వచ్చేశాయ్. ఇకపోతే అనుకున్నట్లే సినిమా 1475 స్క్రీన్స్‌లో తొలిరోజు ఆట పడింది కాబట్టి, రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లే వచ్చాయి. బన్నీ కెరియర్‌లోనే బెస్ట్ అనిపించే ఫిగర్స్ రికార్డ్ అయ్యాయ్.
ఇక నైజాం ఏరియాలో 3.15 కోట్లతో సెకండ్ బెస్ట్ షేర్స్ వసూలు చేసిన సన్ ఆఫ్ సత్యమూర్తి, సీడెడ్‌లో 1.71 కోట్లు, వైజాగ్‌లో 83 లక్షలు, ఈస్ట్‌లో 81 లక్షలు, వెస్ట్‌లో 68 లక్షలు... వసూలు చేసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కలపుకొని 9.27 కోట్లు వసూలు చేసింది. ఇది బన్నీ కెరియర్‌లో కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అత్యుత్తమ ఓపెనింగ్. ఇప్పటివరకు ఆంధ్ర-నైజాం లలో కలిపి చూసుకుంటే.. అత్తారింటికి దారేది (10.75 కోట్లు), ఆగడు (9.74 కోట్లు), టెంపర్ (9.68), బాద్షా (9.25), గోపాల గోపాల (9.19) కోట్లతో టాప్ 5లో ఉంటే.. ఇప్పుడు బాద్షాను ఒక స్థానం క్రిందకు తోసి, సన్ ఆఫ్ సత్యమూర్తి అక్కడొచ్చి కూర్చొంది.
ఇకపోతే సన్ ఆఫ్ సత్యమూర్తికి తొలిరోజు 7 కోట్లు షేర్ కూడా రాదేమో అంటూ కొందరు ట్రేడ్ నిపుణులు చేసిన కామెంట్లు చూసి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఒక స్మయిల్ విసురుతున్నారు. బెస్ట్ ఫిగర్స్ సాధించిన బన్నీని వారు ఆకాశానికి ఎత్తేయకుండా ఉండలేకపోతున్నారట.