జాన్ ను ఫాలో అయిపోతున్న చబ్బీ లేడి

Update: 2016-11-18 13:32 GMT
భారీ కాయం నుంచి ఫిట్ గా తయారవడం అసాధ్యమైన విషయం కాదని.. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. ట్యాలెంట్.. యాక్టింగ్ లలో డిస్టింక్షన్ మార్కులు పడ్డా.. తన సైజ్ విషయంలో మాత్రం నెగిటివ్ మార్కులు వేయించుకునేది. కానీ ఇప్పుడు మాత్రం మిస్ ఫిట్నెస్ అయిపోయి.. అందరికీ షాక్ కొట్టిసిన సోనాక్షి.. ఫుడ్ విషయంలో తాను మోసం చేశానంటూ ఓ సీక్రెట్ చెప్పేసింది.

'జాన్ అబ్రహాం ఫిట్నెస్ నాకు విపరీతంగా నచ్చేసింది. ఆ విషయంలో చాలా అలర్ట్ గా ఉంటాడు. రెండు కాళ్లకు ఆపరేషన్ అయిన తర్వాత.. చాలా త్వరగా కోలుకుని తిరిగి సెట్స్ పైకి వచ్చేశాడు. నేను ఇప్పుడు ఇంత బరువు తగ్గినా.. అప్పడప్పుడు నచ్చిన ఫుడ్ లాగించేస్తూ ఉంటాను. కానీ జాన్ ని చూసిన తర్వాత.. ఈ పనులు చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఇక నుంచి డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను' అని శపథం చేసేసింది సోనాక్షి సిన్హా. జాన్ అబ్రహాం.. సోనాక్షిలు తొలిసారిగా కలిసి నటించిన ఫోర్స్2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. ఫుడ్ విషయంలో తను ఎలా కక్కుర్తి పడేదో చెప్పిందీ చబ్బీ హీరోయిన్.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఫోర్స్ 2లో వీళ్లిద్దరూ కలిసి చేసిన యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని.. ఆడియన్స్ కు విజువల్ ఫీస్ట్ లా ఉంటాయనే టాక్ ఉంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News