మమ్మీ రిటర్న్స్‌ సినిమాకు మోడల్‌ లా..

Update: 2015-11-11 12:37 GMT
మమ్మీ, మమ్మీ రిటర్న్స్ సినిమాలు గుర్తున్నాయా.. అందులో హీరోయిన్ ఎవ్లిన్ పాత్రను పోషించిన రాచెల్ వీజ్ డ్రస్సింగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది. ఆ కేరక్టర్ కి వేసిన డ్రస్సులు ఓ స్పెషల్ స్టయిల్ రూపాంతరం చెందాయి. ఈ మూవీ వచ్చి ఇప్పటికి 15 ఏళ్లు పూర్తయినా.. ఇంకా ఇలాంటి డ్రస్సులకు కొత్త డిజైన్స్ వస్తూనే ఉన్నాయి.

రీసెంట్  గా టాలీవుడ్ బికినీ  బ్యూటీ సోనాల్ చౌహాన్ ఇలాంటి డ్రస్ ఒకటి వేసుకుని ఔరా అనిపించింది. కంప్లీట్ క్లీవేజ్ ని ప్రదర్శిస్తూ.. వేసిన డ్రస్ చూస్తే.. మన సోనాల్ ఇంత బ్యూటీని ఎక్కడ దాచిపెట్టిందబ్బా అనిపించక మానదు. మామూలుగా ఇలా అందాల  ప్రదర్శన అంటే.. ముందునుంచే ఎక్స్ పోజ్  చేస్తారు. కానీ సోనాల్ చౌహాన్ మాత్రం రెండాకులు ఎక్కువే చదివింది. అందుకే అద్దం పక్కన నుంచుని ఫోటోలకు ఫోజులిచ్చింది..

ఇప్పుడు టెన్షన్ చూపరులకు మొదలవుతుందన్న మాట. ఫోటోలో డైరెక్టుగా చూడాలో, అద్దంలో ఉన్న అందాన్ని చూడాలో అర్ధం కాని పరిస్థితి. ఆరేడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా సరైన హిట్ రాలేదు కాబట్టి.. ఇంకా ఇలా ఉంది కానీ.. అసలు సోనాల్ చౌహాన్ ని స్టార్ స్టేటస్ ప్రాపర్టీ అంటాయి పరిశ్రమ వర్గాలు. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ రెడీ అవుతున్నాయి ఈ అమ్మడివి. అనుష్క సైజ్ జీరో నవంబర్  ఆఖర్లో రానుండగా.. బాలయ్య సరసన చేస్తున్న డిక్టేటర్ సంక్రాంతికి సందడి చేయనుంది.
Tags:    

Similar News