టాలీవుడ్ బికినీ బేబీ సోనాల్ చౌహాన్.. ఈ ఏడాది మూడు సినిమాల్లో సందడి చేసింది. పండగ చేస్కో - షేర్ - సైజ్ జీరోలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. అమ్మడి కెరీర్ కి అంతగా ఉపయోగపడలేదు. దీంతో తనకు లెజెండ్ తో హిట్ ఇచ్చిన బాలయ్యపై మళ్లీ ఆశలు పెట్టుకుంది సోనాల్ చౌహాన్. డిక్టేటర్ మూవీలో చాలా కీలకమైన రోల్ చేస్తున్నానని చెబుతోంది. తన రియల్ లైఫ్ దగ్గరగా ఉండే రీల్ లైఫ్ రోల్ ఇది అంటోంది.
డిక్టేటర్ లో సోనాల్ పాత్ర.. రంగీలాలో ఊర్మిళ కేరక్టర్ రేంజ్ లో ఉంటుందట. ఫిలిం ఇండస్ట్రీలో ఎదిగేందుకు పోరాటం చేసే యువతి పాత్రను పోషిస్తున్నట్లు సోనాల్ చెబుతోంది. కాకపోతే ఇది కొంచెం ఫన్నీగా ఉండే కేరక్టర్ అట. డిక్టేటర్ తో మళ్లీ తనకు బాలయ్య పెద్ద హిట్ ఇస్తాడని నమ్మకంగా ఉంది సోనాల్. అంతే కాదు... అసలు నటసింహమే లేకపోతే.. తనకు టాలీవుడ్ కెరీర్ ఉండేది కాదని కూడా అంటోంది. బాలయ్య కోపం గా ఉంటారని చాలామంది అంటూ ఉంటారని, ఇది నిజం కాదని చెప్పిన సోనాల్.. సెట్స్ చాలా జోవియల్ ఉంటారని అంది. అసలు బాలకృష్ణ లేకపోతే.. షూటింగ్ బోర్ కొట్టేస్తుందంట. అయితే.. అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలే చేస్తున్నారేంటి అని అడిగితే మాత్రం.. తన పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఆలోచిస్తా కానీ.. అది లీడ్ రోలా, సెకండ్ హీరోయినా అని ఆలోచించదట.
ఇక తెలుగులో డబ్బింగ్ చెప్పడమే లేటా అంటే.. అబ్బే అంత సీన్ లేదు. ఇప్పుడిప్పుడే తెలుగు మాటలు నేర్చుకుంటున్నా.. ఇంతకు ముందులా తెలుగు పదాలు ఇప్పుడు కష్టంగా అనిపించడం లేదంటూ.. తెలుగు పలుకులు పలుకుతోంది సోనాల్ చౌహాన్.