ముగ్గురు ముగ్ధలు మూడుముళ్లకు సిద్ధమే

Update: 2018-02-22 07:13 GMT
బాలీవుడ్ కి పెళ్లిళ్ల సీజన్ వస్తోందంటూ రీసెంట్ గా తాప్సీ పన్ను చేసిన కామెంట్ అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. రెండు నెలల విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు సౌత్ బ్యూటీ ఇలియానా కూడా తనకు పెళ్లియిపోయిందని చూచాయగా చెప్పేసింది. సుర్వీన్ చావ్లా కూడా తన పెళ్లి అయిపోయిందని ఓపెన్ అయిపోయింది.

ఇవన్నీ ఇప్పటికే పూర్తయిన బాలీవుడ్ పెళ్లిళ్లు అయితే.. ఈ ఏడాదిలో మరో ముగ్గురు టాప్ స్టార్స్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైపోతున్నారని తెలుస్తోంది. ఆనంద్ అహూజాతో సోనమ్ కపూర్ పీకల్లోతు ప్రేమలో ఉందనే ప్రచారం చాలా కాలంగా ఉంది. వీరు ఈ ఏఢాదే పెళ్లి తంతు పూర్తి చేస్తారని అంటున్నారు. అలాగే డీప్-వీర్ గా ఫేమస్ అయిన జంట రణవీర్ సింగ్-దీపికా పదుకొనేలు కూడా ఇదే ఏడాది వివాహ మహోత్సవాన్ని పూర్తి చేసేయాలని ఫిక్స్ అయిపోయారట.

మరోవైపు అమీజాక్సన్ పెళ్లి కబుర్లు కూడా వినిపించేస్తున్నాయి. జార్జ్ అనే వ్యక్తితో అమీ చాలా కాలంగా క్లోజ్ గా ఉంటోందట. ఇతనితో పెళ్లి గతేడాదే పూర్తి కావాల్సి ఉన్నా.. ఈ ఏడాది చివరకు వాయిదా వేసుకుందట. తన పర్సనల్ విషయాలను బైటకు చెప్పేందుకు ఈమె అసలే మాత్రం ఇష్టపడదట. అందుకే ఇంతకాలం ఈ న్యూస్ బయటకు రాలేదని అంటున్నారు.

ఇక డిజైనర్ గాళ్ ఫ్రెండ్ నటాషా దళాల్ లో వరుణ్ ధావన్ పెళ్లి కూడా ఇదే ఏడాది జరగచ్చని అంటున్నారు. సిద్ధార్ధ మల్హోత్రా-ఆలియా భట్ లు బ్రేకప్ అయ్యారని అంటున్నారు కానీ.. లేకపోతే ఈ మ్యారేజ్ కూడా ఈ ఏడాదే జరిగిపోయేది.

Tags:    

Similar News