బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందనే విషయం ఓపెన్ సీక్రెట్. ఈ విషయాన్ని ఈ హీరోయిన్ పైకి చెప్పకపోయినా.. వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో ప్రేమాయణంపై ఇప్పటికే అందరికీ క్లారిటీ ఉంది. ఆనంద్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అంటూ చెబుతుంది కానీ.. అతగాడితో గడిపిన ఆనందాన్ని ఫోటోల రూపంలో ఫ్యాన్స్ కి పంచి.. చూపించి ఊరిస్తూ ఉంటుంది.
ఇప్పుడీ బాలీవుడ్ పిల్ల ప్రేమకు.. తల్లి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సోనమ్ కపూర్ తల్లి.. అనిల్ కపూర్ భార్య అయిన సునీతా కపూర్.. తన కూతురు ప్రేమపై కుండ బద్దలు కొట్టేసింది. అసలు సీక్రెట్ విప్పేసింది. 'ఆనంద్ తో కలిసి పెళ్లి అడుగులు వేయడం చూడాలని కోరుకుంటున్నా' అని చెప్పేసింది సునీతా కపూర్. ఈ మాటతో కూతురు ప్రేమకు ఒప్పుకున్నట్లు అయిపోయింది. మరి తండ్రి అనిల్ కపూర్ కూడా అంగీకరించినట్లేనా అనే డౌట్ రావడం సహజం. కానీ ఆయన అనుమతితోనే ఇంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి ఉండవచ్చని అంటున్నారు.
అయితే.. పెళ్లి విషయంలో సోనమ్ అంతగా కంగారు పడుతున్నట్లుగా లేదు. నీర్జా మూవీతో తనలోని యాక్ట్రెస్ ట్యాలెంట్ ని చూపించడంతో.. రణబీర్ కపూర్.. అక్షయ్ కుమార్ లతో అవకాశాలు అందిపుచ్చుకుంది సోనమ్. ప్రాజెక్ట్ కమిట్మెంట్స్ పూర్తయ్యాకే.. లైఫ్ కమిట్మెంట్ కి సోనమ్ కపూర్ సిద్ధపడే అవకాశాలున్నాయి.