శ్రీదేవే కాదు ఆమె కూడా బాహుబ‌లిని..

Update: 2016-10-14 22:30 GMT
‘బాహుబ‌లి’ సినిమాలో శివ‌గామి పాత్ర కోసం రాజ‌మౌళి ముందు సంప్ర‌దించింది శ్రీదేవినే అన్న సంగ‌తి తెలిసిందే. కానీ తెలుగు సినిమా అని త‌క్కువగా చూసిందో ఏమో.. ఆ సినిమాకు నో చెప్పింది అతిలోక సుంద‌రి. ఆ త‌ర్వాత త‌న నిర్ణ‌యంపై ఎంత బాధ‌ప‌డి ఉంటుందో అంచనా వేయొచ్చు. ఐతే శ్రీదేవి మాత్ర‌మే కాదు.. మ‌రో బాలీవుడ్ భామ కూడా బాహుబ‌లిని కాద‌ని ఇప్పుడు బాధ‌ప‌డుతోంది. ఆ భామ మ‌రెవ‌రో కాదు.. అనిల్ క‌పూర్ ముద్దుల త‌న‌య సోన‌మ్ క‌పూర్. అనేక సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా నిలిచిన నేహా ధూపియా షోలోనే సోన‌మ్ క‌పూర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

‘బాహుబ‌లి’లో ఏ పాత్ర‌ను తాను తిర‌స్క‌రించానో చెప్ప‌లేదు కానీ.. ఈ సినిమాకు నో చెప్పిన మాట మాత్రం నిజ‌మ‌ని వెల్ల‌డించింది సోన‌మ్. ఈ సినిమాను ఎందుకు కాద‌న్న‌ది కూడా ఆమె చెప్ప‌లేదు. బ‌హుశా త‌మ‌న్నా పాత్ర‌కే రాజ‌మౌళి సోన‌మ్ ను అడిగి ఉండొచ్చేమో. ఒక వేళ సోన‌మ్ ఆ పాత్ర చేసి ఉన్నా.. త‌మ‌న్నా లాగా మాత్రం మెరిసేది కాద‌న్న‌ది వాస్త‌వం. కాక‌పోతే సోన‌మ్ చేసి ఉంటే బాహుబ‌లి హిందీ వెర్ష‌న్ కు మ‌రింత క్రేజ్ వ‌చ్చేదేమో. కానీ సౌత్ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని చూస్తే మాత్రం త‌మ‌న్నానే క‌రెక్ట్. తాను త‌న కోస్టార్స్ ఎవ‌రితోనూ సెక్స్ చేయలేదు అని సోన‌మ్ చెప్పింది కూడా ఈ ఇంట‌ర్వ్యూలోనే. దీంతో ఆ ఇంట‌ర్వ్యూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News