బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ పెళ్లికి సర్వం సిద్ధమైపోయింది. వధూవరూలిద్దరూ పెళ్లికి అందమైన అవుట్ ఫిట్లతో ముస్తాబైపోయారు. పెళ్లికొడుకు ఆనంద్ ఆహుజా పెళ్లి ఫోటో ఆన్లైన్లో లీకైంది. కానీ సోనమ్ కపూర్ ఫోటో ఇంకా బయటికి రాలేదు. ఆనంద్ పెళ్లి మంటపానికి చేరేందుకు సిద్దమయ్యాక తీసిన ఫోటో ఇది.
గోల్డెన్ షేర్వాణీలో మెడలో రుబీ ముత్యాల మాలలతో తలపాగాతో ముస్తాబైన ఆనంద్కు పెళ్లికళ వచ్చేసింది. అతని లుక్ స్టన్నింగ్ గా ఉంది. ఒక పెళ్లికూతురు సోనమ్ లుక్ మాత్రం ఇంకా బయటపడలేదు. ఆమె చుట్టూ అమ్మాయిలు చుట్టు ముట్టి ఉండడంతో పాటూ ఆమె చుట్టూ బ్లాక్ కర్టెన్స్ను అడ్డుగోడగా పెట్టి ఉంచారు. దీంతో వచ్చిన అతిధుల కెమెరాలకు సోనమ్ చిక్కలేదు. ఆమె మరింత అందంగా మెరిసిపోవడం ఖాయం. ఆమె వెడ్డింగ్ అవుట్ ఫిట్ చూడడానికే ఎక్కువ మంది ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నారు. వీరి పెళ్లి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న సోనమ్ పిన్నమ్మ బంగ్లాలో జరుగుతోంది. ఈ పాటికే పెళ్లి జరిగిపోయి ఉంటుంది. ముందుగా పెట్టుకున్న ముహూర్తం ప్రకారం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర లోపు పెళ్లి చేయాలి.
సోనమ్-ఆనంద్ ల పెళ్లికి కేవలం బంధుమిత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది. బాలీవుడ్ ప్రముఖుల్లో కూడా చాలా తక్కువ మంది మాత్రమే విచ్చేసినట్టు సమాచారం. పెళ్లి అనంతరం సాయంత్రం జరిగే భారీ రిసెప్షన్ ను బాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. ఆనంద్ ఆహుజా ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్. సోనమ్-ఆనంద్లను కలిపింది వారికి ఫ్యాషన్ మీద ఉన్న ఆసక్తే.