వంద మంది డాన్సర్ల పాటేది?

Update: 2018-12-22 14:49 GMT
ఏంటో కొందరు దర్శకుల ఆలోచనా తీరు చూస్తుంటే ఖర్చు పెట్టె నిర్మాత ఉన్నాడు కదా అని అవసరం ఉన్నా లేకపోయినా ముందు నిడివి ఎంత వస్తుంది అనేది చూసుకోకుండా తీసుకుంటూ పోతున్నారు. తీరా ఎడిటింగ్ టేబుల్ దగ్గర లెంత్ విషయంలో కంప్లయింట్ వచ్చాక అప్పుడు కత్తెర్లు పట్టుకుని నిర్మాతలకు గుండె నొప్పి తెప్పిస్తున్నారు. ఆ మధ్య శంకర్ 2.0 కోసం ఇరవై కోట్లతో ఓ పాట తీసానని గొప్పగా చెప్పుకున్నాడు. తీరా చూస్తే జనం సినిమా అయిపోయిందని లేచి వెళ్ళిపోతున్న సమయంలో ఎండ్ టైటిల్స్ లో వేసాడు. దాని వల్ల కలిగిన ప్రయోజనం శూన్యం. అసలా పాట లేకపోయినా వచ్చిన నష్టం ఏమి లేదు.

నిన్న విడుదలైన పడి పడి లేచే మనసు విషయంలో కూడా ఇలాగే జరిగినట్టు కనిపిస్తోంది. ప్రమోషన్ లో భాగంగా గతంలో దర్శకుడు హను రాఘవపూడి ఇందులో రాజస్తాన్ లో తీసిన ఓ పాట గురించి గొప్పగా చెప్పాడు. వందకు పైగా డాన్సర్లతో ఊహించని రేంజ్ లో ఓ పాట షూట్ చేసామని అది పెద్ద ప్లస్ అవుతుందని కాస్త గట్టిగానే చెప్పాడు. కట్ చేస్తే పడి పడి లేచే మనసులో అసలు ఆ పాటే లేదు. అది లేకుండానే సినిమా మూడు గంటలకు పావు గంట తక్కువ వచ్చింది. అందులోనూ సెకండ్ హాఫ్ మీద వస్తున్న కామెంట్స్ కి ఫస్ట్ హాఫ్ ఒకటే చూపించినా హిట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో ట్రాలింగ్ కూడా మొదలైపోయింది.

మరి అంత మంచి పాటను హను ఎందుకు కట్ చేసాడో అర్థం కావడం లేదు. సినిమా మొత్తం అనవసరం అనిపించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని తీసేసినా ఈ పాటకు స్పేస్ దొరికేది. కనీసం ఆ విజువల్ ట్రీట్ కు అయినా ప్రేక్షకులు కాస్త సంతృప్తి చెందేవాళ్ళు. ఇప్పుడా ఛాన్స్ లేకుండా పోయింది. ఒకవేళ రేపో ఎల్లుండో యాడ్ చేసినా ఉపయోగం లేదు. అసలు అవసరం లేనప్పుడు ఇలాంటివి తీయడం ఎందుకో ఎడిటింగ్ లో లేపడం ఎందుకో
Tags:    

Similar News