‘జనతా గ్యారేజ్’ లెంగ్త్ ఎక్కువైందని.. దీంతో ఓ పది నిమిషాల దాకా ట్రిమ్ చేశారని వార్తలొచ్చాయి ఈ మధ్య. ఐతే ఈ వార్తలు శుద్ధ అబద్ధమని అంటున్నాడు కొరటాల. ఐతే ‘జనతా గ్యారేజ్’ తెలుగు వెర్షన్ విషయంలో అసలేమాత్రం కత్తెరకు పని చెప్పలేదన్న కొరటాల.. మలయాళ వెర్షన్ విషయంలో మాత్రం కొంత కోత పడ్డట్లు వెల్లడించాడు.
‘‘ఫైనల్ కట్ ఫిక్సయ్యాక ఒక్క సీన్ కూడా తీయలేదు. నిజానికి సినిమా రిలీజయ్యాక జనాల స్పందన చూసి.. రెండో వారం నుంచి ఇంకో పది నిమిషాల కంటెంట్ పెంచుదామనుకుంటున్నాం. మలయాళ వెర్షన్ మాత్రం కొంత తగ్గించాం. ఒక పాట తీసేశాం. కొన్ని కామెడీ సీన్లు కూడా లేపేశాం’’ అని కొరటాల వెల్లడించాడు. బహుశా మలయాళ వెర్షన్ కోసం ఎన్టీఆర్-సమంతల మీద తీసిన యాపిల్ బ్యూటీ పాటను లేపేసి ఉండొచ్చని భావిస్తున్నారు. కామెడీ సీన్లు కూడా ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చేవే అయ్యుండొచ్చు.
మరోవైపు కాజల్ చేసింది ఐటెం సాంగే అయినా.. అది కూడా సినిమాలో సిచ్యువేషన్ కు తగ్గట్లే ఉంటుందన్న కొరటాల.. తన నిర్మాతల సూచన మేరకే ఆమెను పక్కా లోకల్ పాటకు ఎంచుకున్నట్లు తెలిపాడు. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఎలాంటి ఇమేజ్ బ్యాగేజ్ మోయలేదని.. పూర్తిగా క్యారెక్టర్ కు తగ్గట్లే కనిపించాడని.. తాను ఏం కోరుకున్నానో అలాంటి పెర్ఫామెన్సే ఇచ్చాడని కొరటాల తెలిపాడు. సినిమాలో హీరోయిన్లిద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందని.. అవి రెండూ కంటెంట్ ఉన్న పాత్రలని చెప్పాడు.