రియల్ హీరో సోనూసూద్ సేవా కార్యక్రమాలు 2022 లోనూ కంటిన్యూ అవుతున్నాయి. 2020 సంవత్సరంలో కరోనా ఆరంభం సమయంలో లాక్ డౌన్ విధించడంతో సేవా కార్యక్రమాలతో ముందుకు వచ్చిన సోనూసూద్ వేలాది మంది వలస కూలీలను లక్షల రూపాయలు ఖర్చు చేసి వారి వారి సొంత ప్రాంతాలకు తరలించడం జరిగింది. సోనూ సూద్ కేవలం వలస కూలీలను వారి వారి ప్రాంతాలకు తరలించడంతో తన పని అయిపోయిందని ఊరుకోలేదు. కరోనా వల్ల అల్లాడుతున్న వేలాది మంది ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చాడు. ఆయన ప్రతి ఒక్క అడుగు కూడా సేవా గుణం చాటుకుంది అనడంలో సందేహం లేదు. స్టూడెంట్స్.. పేద రైతు.. కష్టాల్లో ఉన్న ఉద్యోగి.. నిరుద్యోగి ఇలా ప్రతి ఒక్క రంగానికి చెందిన వారి సాయంను గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలోనే వెయ్యి మంది ఆడపిల్లల కళ్లలో ఆనందం ను సోనూ సూద్ నింపాడు.
స్కూల్ దూరం అయ్యి నడిచేందుకు ఇబ్బంది పడుతున్న అమ్మాయిలకు మరియు మహిళ సోషల్ వర్కర్స్ కు సోనూసూద్ తన సోదరి మాల్విక సూద్ తో కలిసి సైకిల్స్ ను పంపిణీ చేయడం జరిగింది. ఏకంగా వెయ్యి మంది అమ్మాయిలు మరియు సోషల్ వర్కర్స్ కు వీరు సొంత నిధులతో ఈ సైకిల్స్ ను పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం పెద్ద మొత్తంలో వారు ఖర్చు చేశారంటూ స్థానికులు చెబుతున్నారు. ఆ అమ్మాయిలకు కేవలం సైకిల్స్ మాత్రమే కాకుండా ఇతర అవసరాలను కూడా వీరిద్దరు తీర్చేందుకు ముందుకు వచ్చారట.
మహిళ సోషల్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా వీరిద్దరు స్పందించారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారట. సోనూసూద్ మరియు ఆయన సోదరి చేసిన ఈ సేవా కార్యక్రమంకు ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. సోనూసూద్ ముందు ముందు కూడా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. సోనూసూద్ సినిమాల విషయానికి వస్తే ఈయన నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అది కాకుండా తెలుగు లో మరికొన్ని సినిమాలను కూడా ఈయన చేశాడు. హీరోగా ఒక సినిమాను సోనూ సూద్ చేస్తున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. ఆ సినిమా స్టేటస్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.