సూర్యవంశీ - 83 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ...!

Update: 2020-08-23 02:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కుంటోంది. గత ఐదు నెలలుగా థియేటర్ల మూసివేసి ఉండటంతో కొందరు మేకర్స్ తమ సినిమాలని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'దిల్‌ బెచారా' 'ఖుదాఫీజ్‌‌' 'యారా' 'లూట్‌ కేస్‌' 'శకుంతలాదేవి' 'పెంగ్విన్' 'గుంజన్ సక్సేనా' వంటి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు అక్షయ్ కుమార్ 'లక్ష్మీ బాంబ్'.. అభిషేక్‌ బచ్చన్‌ 'ది బిగ్‌ బుల్‌'.. ఆలియా భట్‌ 'సడక్‌ 2'.. నాని - సుధీర్ బాబు నటించిన 'వి' మరియు సూర్య 'ఆకాశమే నీ హద్దురా'.. అజయ్‌ దేవగణ్‌ 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' వంటి క్రేజీ మూవీస్ కూడా ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శెట్టి దర్శకత్వం అక్షయ్ కుమార్ - కత్రీనా కైఫ్ నటించిన 'సూర్యవంశీ' మరియు రణవీర్ సింగ్ - దీపికా పడుకుణే నటించిన కపిల్ దేవ్ బయోపిక్ '83' మూవీస్ కూడా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని ఆ సినిమా నిర్మించిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సీఈఓ శిబాసిష్ సర్కార్ వెల్లడించినట్లు ఓ వెబ్ మీడియా వెల్లడించింది. అయితే ఈ న్యూస్ పై శిబాసిష్ సర్కార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

''మేము సూర్యవంశీ & 83 ని థియేటర్లలో విడుదల చేయడానికి 100% మొగ్గు చూపుతున్నాము. అయితే రిలీజ్ డేట్స్ ని ఇకపై పుష్ చేయాలని మేము అనుకోవడం లేదు. రాబోయే రోజుల్లో మహమ్మారి పరిస్థితులు ఇలానే కొనసాగి థియేటర్స్ తెరవకపోతే.. మా దర్శకులు నటులు మరియు నిర్మాణ భాగస్వాములతో సంప్రదించి రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకుంటాం. అది థియేట్రికల్ లేదా డిజిటల్ టీవీఓడీ & ఎస్విఓడీ అనేది ఆలోచిస్తాం. ఖచ్చితంగా విడుదల తేదీలను మరింత ముందుకు నెట్టాలని మేము అనుకోవడం లేదు. అయితే థియేటర్స్ ఓపెన్ చేస్తే దీపావళి & క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకులు ఈ చిత్రాలను బిగ్ స్క్రీన్ పై చూస్తారని నేను ఆశాభావంతో ఉన్నాను'' అని శిబాసిష్ సర్కార్ పేర్కొన్నారు. దీనిని బట్టి దీపావళి లేదా క్రిస్మస్‌ సమయానికి థియేటర్లు తెరుచుకుంటే థియేట్రికల్ రిలీజ్ లేదా ఓటీటీ విడుదలకి వెళ్ళబోతున్నట్లు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోందని స్పష్టం అయింది.
Tags:    

Similar News