రోబో రజినీ వాయిస్‌ కు చాలా కష్టపడ్డారట!

Update: 2018-11-29 10:35 GMT
రజినీకాంత్‌ - శంకర్‌ లో కాంబినేషన్‌ లో తెరకెక్కి చాలా కాలంగా ఆసక్తి రేపిన ‘2.ఓ’ చిత్రం నేడు భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సౌత్‌ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు మరియు ఓవర్సీస్‌ లో ఈ చిత్రం భారీగా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంకు అన్ని చోట్ల కూడా మంచి టాక్‌ వస్తుంది. ఇక ఈ చిత్రంకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. చివరకు రజినీకాంత్‌ హ్యుమన్‌ పాత్రకు - రోబో పాత్రకు విభిన్నమైన వాయిస్‌ లు పెట్టడం కోసం కూడా చాలా టెక్నాలజీని వాడారట.

శంకర్‌ గత చిత్రం ‘రోబో’ మరియు ఈ చిత్రంకు కూడా సౌండ్‌ ఇంజనీర్‌ గా రిసుల్‌ పోకిశెట్టి వర్క్‌ చేయడం జరిగింది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోబో సమయంలో రజినీకాంత్‌ కు రెండు వాయిస్‌ లు కావాల్సి వచ్చింది. రజినీకాంత్‌ వంటి స్టార్‌ కు వేరే వారితో డబ్బింగ్‌ చెప్పిస్తే ప్రేక్షకులు ఊరుకోరు. అందుకే టెక్నాలజీతో ఆయన వాయిస్‌ నే మార్చి ఇందులో పెట్టాలనుకున్నాం. అందుకోసం చాలా కష్టపడ్డాం. దర్శకుడు శంకర్‌ గారి క్రియేటివిటీతో ఆ చిత్రంలో రజినీకాంత్‌ గారికి మంచి వాయిస్‌ లు సెట్‌ అయ్యాయి. అప్పుడు వాడినట్లుగానే ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌ మరియు రజినీకాంత్‌ గారి వాయిస్‌ ను మార్చేందుకు Psycho-Acoustic Division టెక్నాలజీని వాడటం జరిగిందని పేర్కొన్నాడు.

ప్రతి విషయంలో ఇంతగా జాగ్రత్తలు తీసుకున్నాడు కనుకే నేడు ఇంత భారీ విజయాన్ని దక్కించుకుందని రజినీకాంత్‌ అభిమానులు అంటున్నారు. అద్బుతమైన స్పందన దక్కించుకున్న ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ ను రాబట్టేలా కనిపిస్తోంది. లాంగ్‌ రన్‌ లో కూడా ఈ చిత్రం భారీగా వసూళ్లను నమోదు చేయబోతుంది.

Tags:    

Similar News