గత రెండు మూడు దశాబ్దాల్లో తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన హీరోయిన్ ఎవరు అంటే మరో మాట లేకుండా సౌందర్య పేరు చెప్పేయొచ్చు. హీరోయిన్లంటే మామూలుగా ఓ చిన్న చూపు ఉంటుంది కానీ.. సౌందర్య విషయంలో అలాంటి ఫీలింగ్ ఎవరికీ కలగదు. తెలుగు ప్రేక్షకులు ఆమెను తమ ఇంటి అమ్మాయిలాగా భావించారు. ఆమె అందాన్ని ఆరాధించారు. అభినయానికి ముగ్ధులయ్యారు.
అవ్వడానికి కన్నడ అమ్మాయే అయినా.. తెలుగమ్మాయి అన్న ఫీలింగ్ కలిగించి.. కథానాయికగా దశాబ్దంన్నర పాటు తెలుగు తెరను ఏలింది సౌందర్య. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం-కన్నడ సినిమాలతోనూ ఆమె బలమైన ముద్రే వేసింది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సినిమాల్లో ఉన్నంత కాలం పీక్స్ లోనే ఉన్న సౌందర్య.. 2003లో పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడినపుడు ఆమె అభిమానులు ఎంత సంతోషించారో? కానీ వైవాహిక జీవితాన్ని ఏడాది మాత్రమే ఆస్వాదించి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందామె. 2004లో కేవలం 31 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందామె.
ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాల్లోనే కష్టపడుతూనే సాగిన ఆమె... ఇక ప్రశాంతంగా వ్యక్తిగత జీవితాన్ని గడపడానికి సిద్ధమైన కొంత కాలానికే అలా అయిపోవడం విచారకరమైన విషయం. సౌందర్య చనిపోయినపుడు అభిమానుల వేదన అంతా ఇంతా కాదు. ఇప్పుడు తలుచుకున్నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అభిమానులకు. ఎప్పుడైనా పాత సినిమాల్లో ఆమెను చూసినా గుండె బరువెక్కుతుంది. ఓ హీరోయిన్ ఇలాంటి ‘నిజమైన’ అభిమానం సంపాదించుకోవడం అరుదైన విషయం. సౌందర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి పుష్కరం దాటినా.. ఆమె జ్నాపకాలు మాత్రం పదిలం. ఇవాళ సౌందర్య జయంతి. ఆ ప్రమాదం జరక్కపోయి ఉంటే 44వ పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుని ఉండేదామె. ఆ అభినయ సౌందర్యానికి నివాళి అర్పిస్తోంది తుపాకి.కామ్.