టీడీఎస్ త‌గ్గిస్తే నిర్మాతల భారం దిగుతుందా?

Update: 2020-03-17 10:15 GMT
వినోదం పై జీఎస్టీ గుదిబండ అంటూ అప్ప‌ట్లో త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ స‌హా తెలుగు సినీప‌రిశ్ర‌మ ఇత‌ర సౌత్ ప‌రిశ్ర‌మ‌లు గ‌డ‌బిడ చేశాయి. ఒక్క త‌మిళ తంబీలు త‌ప్ప ఇంకెవ‌రూ ఈ పోరాటం లో తుదికంటా నిల‌బ‌డ‌క‌ పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ఇక జీఎస్టీ వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌కు క‌లిగే ముప్పు గురించి తెలుగు సినీ నిర్మాత‌లు లైట్ తీస్కున్నార‌న్న ప్ర‌చారం సాగింది.

అదంతా అటుంచితే.. టీడీఎస్ వ్య‌వ‌హారంపై దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ త‌ర‌పున పలువురు ప్రతినిధులు ఈ రోజు న్యూ దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. టిడిఎస్ శాతానికి సంబంధించి మెమోరాండాన్ని సమర్పించారు. దక్షిణాది నిర్మాతలు ఆది శేష‌గిరి రావు- రాక్ లైన్ వెంకటేష్- దాము- ప్రముఖ హీరోయిన్.. నిర్మాత సుమలత మంత్రిని కలిసిన ప్రతినిధి బృందం లో ఉన్నారు.

పంపిణీదారుల షేర్ స‌హా నిర్మాతల షేర్ పైనా విధించే టీడీఎస్ శాతం గురించి నిర్మాతలు మంత్రికి చెప్పారు. నిర్మలా సీతారామన్ వీటిని ప‌రిశీలించి సత్వర ఉప‌శ‌మ‌నానికి తీర్మానం చేస్తామ‌ని.. వివిధ చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్మాతల త‌ర‌పున మంత్రి వ‌ర్యులు సమస్యలను అర్థం చేసుకున్నందుకు.. సానుకూలంగా ప్రతిస్పందించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేవ‌లం జీఎస్టీ.. టీడీఎస్ వంటివి త‌గ్గిస్తే నిర్మాత‌ల‌పై భారం త‌గ్గుతుందా? అంటే చెప్ప‌లేం. బ‌డ్జెట్లు అదుపులో ఉంచుకుని సినిమాలు చేయాలి. మంచి కంటెంట్ తో తీస్తేనే ఆడే స‌న్నివేశం ఉందిప్పుడు. ఇంకా ర‌క‌ర‌కాల కార‌ణాలు కాస్ట్ ఫెయిల్యూర్ నుంచి బ‌య‌ట‌ప‌డేస్తున్నాయి.


Tags:    

Similar News