సౌత్ ఇండియాలో వంద కోట్ల సినిమాలివే

Update: 2016-02-23 17:30 GMT
సౌత్ ఇండియన్ సినిమా అంటే ఏంటో గత కొన్నేళ్లలో అందరికీ తెలిసొచ్చింది. ఇంతకుముందు మన సినిమాలు బాలీవుడ్డోళ్లు తేలిగ్గా తీసుకునేవారు కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. దేశమంతా మార్కెట్ ఉన్న బాలీవుడ్ సినిమాలకు దీటుగా తెలుగు - తమిళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్నాయి. వంద కోట్ల గ్రాస్ వసూళ్లు అన్నవి బాలీవుడ్ సినిమాలకే సాధ్యం అని విర్రవీగేవారు కానీ.. వాటి కంటే సునాయాసంగా ఆ మార్కును అందుకుంటున్నాయి సౌత్ సినిమాలు. గత ఐదేళ్లలో 18 సౌత్ ఇండియన్ సినిమాలు రూ.100 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. ఆ సినిమాలేవో.. వాటి కలెక్షన్లు ఎంతో ఓ లుక్ వేయండి.

 1.   బాహుబలి- రూ.586 కోట్లు (తెలుగు, తమిళం, మలయాళం, హిందీ)
 2.   రోబో- రూ.289 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
 3.   ఐ- రూ.239 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
 4.   శివాజీ- రూ.155 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
 5.   లింగా- రూ.154 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
 6.   మగధీర- రూ.150 కోట్లు (తెలుగ, తమిళం, మలయాళం)
 7.   శ్రీమంతుడు- రూ.144.55 కోట్లు (తెలుగు, తమిళం)
 8.   అత్తారింటికి దారేది- రూ.131 కోట్లు (తెలుగు మాత్రమే)
 9.   వేదాలం- రూ.126 కోట్లు (తమిళం మాత్రమే)
 10. తుపాకి- రూ.125 కోట్లు (తమిళం, తెలుగు)
 11.  కత్తి- రూ.125 కోట్లు
 12.   సింగం 2- రూ.122 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
 13.  కాంఛన 2- రూ.113 కోట్లు (తమిళం, తెలుగు)
 14.   విశ్వరూపం- రూ.108 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
 15.  గబ్బర్ సింగ్- రూ.104 కోట్లు (తెలుగు మాత్రమే)
 16.  రేసుగుర్రం- రూ.102 కోట్లు (తెలుగు, మలయాళం)
 17.  పులి (విజయ్)- 101.9 కోట్లు (తమిళం, తెలుగు, హిందీ)
 18.   దూకుడు- రూ.100 కోట్లు (తెలుగు, తమిళం, మలయాళం)
Tags:    

Similar News