చిరు.. బాలయ్య.. నాగ్.. వెంకీ.. కలిసి.

Update: 2017-05-30 11:07 GMT
మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ.. అక్కినేని నాగార్జున.. విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఒక వేదిక పైకి వస్తే ఆ మజానే వేరు. సినీ వేడుకలతో సంబంధం లేకుండా వీళ్లు ప్రతి ఏటా వ్యక్తిగతంగా ఒక వేడుకలో కలుస్తారు. ‘క్లాస్ ఆఫ్ 80 రీ యూనియన్’ పేరుతో 80ల్లో హవా సాగించిన తారలంతా కలిసి ప్రతి ఏటా ఒక చోట కలుస్తారన్న సంగతి తెలిసిందే. తెలుగు పరిశ్రమ నుంచి చిరు.. బాలయ్య.. నాగార్జున.. వెంకీలతో పాటు తమిళ.. కన్నడ..మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన అప్పటి తరం తారలు ఈ వేడుకలో పాల్గొంటూ ఉంటారు. గత ఏడాది కూడా చెన్నైలో 32 మంది తారలు కలిసి సంబరాలు చేసుకున్నారు.

నిరుడు మన హీరోలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్.. మోహన్ లాల్.. అంబరీష్.. రాధిక.. సుహాసిని.. రేవతి.. లిసీ.. సరిత.. జయరాం.. రాధ తదితరులు చెన్నైలో మీట్ అయి సంబరాల్లో పాల్గొన్నారు. ఈసారి కూడా ఈ వేడుకను పెద్ద స్థాయిలో చేయాలని అనుకుంటున్నారు. ఈసారి లోకల్ గా కాకుండా ఫారిన్లో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం చైనాను వేదికగా ఎంచుకున్నారట. జూన్ తొలి వారంలో వీళ్లందరూ కలిసి చైనాకు బయల్దేరబోతున్నారట. ఇప్పటికే ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ అయ్యాయని.. మీడియాలో దీని గురించి పెద్దగా ప్రచారం లేకుండా తమ వరకే ఈ వేడుక విశేషాలు ఉండాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News