12 గంటల్లోనే ఓటీటీ వరల్డ్ లో 'స్పార్క్' ప్రభంజనం..!

Update: 2021-05-15 13:30 GMT
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన జనాలు ఎంటర్టైన్మెంట్ కి దూరమయ్యారు. లాక్ డౌన్ పెడుతుండటం.. థియేటర్స్ కూడా మూతబడటంతో వినోదం కోసం ప్రేక్షులంతా ఓటీటీల వైపు చూస్తున్నారు. ఇలాంటి సరైన సమయంలో ఓటీటీ రంగంలోకి సరికొత్తగా 'స్పార్క్' అనే పేరుతో మరో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది.

యువ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త సాగ‌ర్ మాచ‌నూరు 'స్పార్క్' ఫ్లాట్ ఫార్మ్ తో ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి భారత ఓటీటీ రంగంలో అడుగుపెట్టారు. ఈ రోజు నుంచే స్పార్క్ ఓటీటీ సేవలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెరకెక్కించిన ‘డీ కంపెనీ’ ప్రసారంతో ఈ ఓటీటీకి శ్రీకారం చుట్టారు.

అయితే 12 గంటల్లోనే 'స్పార్క్' ఓటీటీకి వచ్చిన సబ్ స్క్రైబెర్స్ చూస్తే రాబోయే రోజుల్లో ఇది ఓటీటీ వరల్డ్ లో ప్రభంజనం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. 'డి కంపెనీ' సినిమాతో స్టార్ట్ అయిన ఈ ఓటీటీ 12 గంటల్లోనే 1,21,986 సబ్ స్క్రైబెర్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనిని బట్టి 'స్పార్క్' ఎంట్రీ తోనే ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుందని చెప్పవచ్చు.

ఓటీటీ రంగంలో ఇప్పటికే అనేక ఫ్లాట్ ఫార్మ్స్ అందుబాటులో ఉన్నా.. 'స్పార్క్' ఓటీటీ ప్రత్యేకతను చాటుకోవాలని చూస్తోంది. ఇందులో ఒరిజినల్ వెబ్ సిరీస్ లతో పాటుగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషలకు చెందిన పాపులర్ చిత్రాలను కూడా ప్రసారం చేయనుంది. 'స్పార్క్' ఓటీటీలో రాంగోపాల్ వర్మ ఏకంగా ఓ థియేటర్ ను అద్దెకు తీసుకున్నారు. అందులో వర్మకు చెందిన అన్ని రకాల చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
Tags:    

Similar News