కన్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల ఆరోపణల్లో అరెస్టుల ఫర్వం సంచలనమైన సంగతి తెలిసిందే. ఓవైపు బాలీవుడ్ డొంక.. మరోవైపు శాండల్ వుడ్ డొంక కదిలిపోతున్నాయ్. ఈ కేసులో ఇప్పటికే కథానాయికలు సంజన గల్రానీ.. రాగిణి ద్వివేది సహా రాహుల్ అరెస్టయి జైలు కెళ్లారు. వీరిపైనా సి.సి.బి విచారణ సాగుతోంది.
అయితే ఈ కేసులో బెయిల్ కోరుతూ స్పెషల్ కోర్టుకు వెళ్లారు కథానాయికల తరపు న్యాయవాదులు. కానీ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించిందని తాజాగా మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కేసులో నిందితులైన వారిలో ఇతరుల బెయిల్ పిటిషన్లపై వాదనలు సెప్టెంబర్ 30 న జరుగుతాయి. డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నందుకు సంజన గల్రానీ ఆమె తల్లిని సెప్టెంబర్ 8 న బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) అదుపులోకి తీసుకున్న ఒక రోజు తర్వాత అరెస్టు చేసింది. తరువాత తల్లి-కుమార్తె ద్వయాన్ని మరింత విచారణ కోసం చమరాజ్ పేటలోని సిసిబి కార్యాలయానికి పంపారు.
సెప్టెంబరు 7 న రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. సిసిబి వెల్లడించిన వివరాల ప్రకారం.. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ కేసుకు సంబంధించి నియాజ్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేయనున్నారని మీడియా కథనాలు వచ్చాయి. ఈ విషయంలో కన్నడ దర్శకనిర్మాత ఇంద్రజిత్ లంకేష్.. మరికొంతమంది నటులను కూడా సిసిబి ప్రశ్నించింది. కన్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వినియోగం గురించి లంకేశ్ సమాచారాన్ని వెల్లడించడం విశేషం.