నిన్న సోషల్ మీడియా వేదికగా బయటికి వచ్చిన బాబాయ్ అబ్బాయ్ ల లంచ్ వీడియో మామూలు వైరల్ కాలేదు. ముఖ్యంగా అభిమానులు విపరీతంగా షేర్ చేసుకుని ఇక ఇద్దరు ఒకటయ్యారంటూ ఆనందం వ్యక్తం చేయగా కొన్ని మీడియా వర్గాలు ఇకపై బాలయ్య కళ్యాణ్ రామ్ కు జూనియర్ ఎన్టీఆర్ కు అండగా నిలవబోతున్నాడంటూ చెప్పుకొచ్చాయి. అక్కడితో ఆగలేదు. త్వరలో జరగాల్సిన అరవింద సమేత వీర రాఘవ ఆడియో వేడుకకు బాలకృష్ణ గెస్ట్ గా వస్తాడని నిన్న వీడియోలో చూపించిన రెండు నిమిషాల చర్చలో కూడా అదే ప్రధానంగా ఉందని అల్లేశారు. నిజానికి నిన్న మనం చూసింది హరి కృష్ణ గారి చిన్న దినంలో భాగంగా జరిగిన భోజన కార్యక్రమం. అందులో హరికృష్ణ గారి తాలూకు జ్ఞాపకాలు లేదా పెద్ద కర్మ ఎలా చేయాలి ఎవరిని పిలవాలి ఏర్పాట్లు తదితర విషయాలు ఉంటాయే తప్ప సినిమా ఆడియోల తాలూకు డేట్లు రిలీజ్ కు సంబంధించిన అంశాలు ఉండవు. అది వేదిక కూడా కాదు. ఎంత షూటింగ్ కు సిద్ధమైనా కళ్యాణ్ రామ్ తారక్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది.
బాలయ్య తాను జూనియర్ కు దూరమనో లేదా తారక్ బాబాయ్ తనను పలకరించడం లేదనో ఇద్దరిలో ఎవరూ ఎక్కడా చెప్పలేదు. కొన్నేళ్లుగా ఏ స్టేజి మీద కలవలేదు అన్నది నిజమే. దానికి కారణాలు చెప్పలేం కానీ ఏదో పెద్ద అగాధం ఉన్నట్టు నిన్న ఆ భోజనం చేస్తున్నప్పుడే కలిసిపోయి ఏకంగా తారక్ బాబాయ్ ను ఆడియో కు ఆహ్వాచించినట్టు చెప్పడం కాస్త అతిశయోక్తే. కలిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. అభిమానులే కాదు సగటు సినిమా ప్రేక్షకులు కూడా సంతోషిస్తారు. కానీ దాని తాలూకు ప్రోగ్రెస్ ఈ రెండు రోజుల్లోనే జరిగిపోయినట్టు చెప్పడం మాత్రం సరికాదు. తొందరపాటుతనమే అవుతుంది. అయినా అంత బాధలో ఉండగా నా పాటల వేడుక ఉంది రా బాబాయ్ అని ఎన్టీఆర్ పిలవడాన్ని ఊహించుకోవడం కూడా ఎబ్బెట్టుగా ఉంది. ఏదో ఓ వారం రోజులు అయ్యాక ఇలా జరిగింది అని చెప్పినా నమ్మశక్యంగా ఉంటుంది కానీ అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే బాలయ్య అతిధిగా అరవింద సమేత వీర రాఘవ ఆడియో వేడుక అని చెప్పడం మాత్రం ఫ్యాన్స్ సైతం నమ్మలేనిదే. కానీ ఇదే జరగాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ప్రస్తావించాల్సిన సమయం ఇది కాదని గుర్తిస్తే మంచింది.