చిన్నా పెద్దా అనే విభేధం లేకుండా అన్ని వర్గాలను అలరించిన మోస్ట్ ఫేమస్ గేమ్ షో స్క్విడ్ గేమ్. ఈ సెప్టెంబర్ లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన సదరు గేమ్ షో ఓటీటీలో గొప్ప ఆదరణ పొందిన నంబర్ 1 ప్రదర్శనగా సంచలనాలు సృష్టించింది. స్క్విడ్ గేమ్ ఆధారంగా అన్ లిమిటెడ్ గా మీమ్ లు గేమ్ లు పుట్టుకొచ్చాయి. చాలా తక్కువ కాలంలో గొప్ప ఆదరణ పొందిన గేమ్ షోగా అవతరించింది.
అందుకే ఇప్పుడు సీజన్ 2 కోసం అభిమానుల నుంచి అసాధారణ డిమాండ్ నెలకొంది. ఇదే విషయాన్ని అంగీకరించిన స్క్విడ్ గేమ్ సృష్టికర్త.. దర్శకరచయిత హ్వాంగ్ డాంగ్ హూక్ సీజన్ 2 కోసం సన్నాహకాల్లో ఉన్నారు. ఈసారి రెండవ సీజన్ కథాంశం భిన్నంగా ఉంటుంది. ప్రధాన పాత్ర గి హన్ ని అనుసరించి ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. ప్రధాన పాత్ర గి హన్ సీజన్ 2లో ప్రపంచం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండే వాడిగా కనిపిస్తాడు. పార్ట్ వన్ స్ఫూర్తితోనే దర్శకుడు సీజన్ 2ని ప్రకటిస్తూ ..మీరు మాకు ఎటువంటి ఛాయిస్ ను వదిలిపెట్టరు అని వ్యాఖ్యానించారు. అయితే రెండవ సీజన్ ను రూపొందించాల్సి ఉందని దానికోసం సన్నాహకాల్లో ఉన్నామని అన్నారు.
`స్క్విడ్ గేమ్ 2` కోసం తన వద్ద బాగా అభివృద్ధి చెందిన ప్రణాళిక లేదని దర్శకుడు అంగీకరించాడు. కానీ ఇప్పుడు అతను ఒంటరిగా చేయనని దాని కోసం చాలా మంది రచయితలను .. బహుళ అనుభవజ్ఞులైన దర్శకులను తీసుకురావాల్సి ఉందని చెప్పాడు. స్క్విడ్ గేమ్ సిరీస్ అనేది ప్రాణాంతకమైన మలుపులతో సాగే పిల్లల గేమ్ లలో పాల్గొనే గ్రేకలర్ పాత్రల సమూహం. విజేతలు తమ అప్పులు తీర్చడానికి తగినంత డబ్బు తీసుకుంటారు. దీనికి కొనసాగింపు భాగంలో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉంటాయన్నది చూడాలి.