కొన్ని సినిమాలకు చాలా మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. చూసిన వాళ్లందరూ మంచి సినిమా అంటారు. గొప్ప సినిమా అంటారు. అందరూ చూడాల్సిన సినిమా అంటారు. కానీ అవి ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కావు. కేవలం క్లాసిక్ ముద్రతో థియేటర్ల నుంచి నిష్క్రమిస్తాయి. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాయి. ఈ యువ కథానాయకుడు కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నాడు. మంచి పాత్రలు ఎంచుకుంటున్నాడు. అతను తొలిసారి పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’కు చాలా మంచి పేరొచ్చింది. దాన్ని ఒక క్లాసిక్ అన్నారు. నారా రోహిత్ తో పాటు శ్రీవిష్ణు భార్య ప్రశాంతి.. ‘అసుర’ దర్శకుడు కృష్ణ విజయ్ ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మించి తమ అభిరుచిని చాటుకున్నారు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఆ తర్వాత విష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’కు కూడా చాలా మంచి టాక్ వచ్చింది. దీన్ని ఒక స్పెషల్ మూవీ అన్నారందరూ. కానీ అది కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ రెండు చిత్రాలతోనూ విష్ణు చాలా మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు విష్ణు కొత్త సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’కు కూడా ఇలాంటి ఫీడ్ బ్యాకే వస్తోంది. దీన్ని కూడా ఒక క్లాసిక్ గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా అవసరమని.. తెలుగులో ఇలాంటి ప్రయత్నం జరగడం గొప్ప విషయమని అంటున్నారు. చూసిన వాళ్లందరూ సినిమా బాగుందంటున్నారు. మరి ఈ చిత్రమైనా బాగా ఆడుతుందా.. డబ్బులు రాబడుతుందా.. కమర్షియల్ గా మంచి విజయం సాధించి.. ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కేందుకు బాటలు వేస్తుందా అన్నది చూడాలి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయడం విశేషం.