కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో మెప్పిస్తూ వస్తున్న వర్సటైల్ హీరో శ్రీ విష్ణు.. తనకంటూ ఓ వర్గం ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. శ్రీ విష్ణు సినిమా వస్తుందంటే.. కచ్చితంగా అందులో ఏదో విషయం ఉంటుందనే భావన కలిగేలా చేసాడు. అలాంటి హీరో ఇప్పుడు "అల్లూరి" చిత్రంతో థియేటర్లలోకి వచ్చాడు.
శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అల్లూరి". 'నిజాయితీకి మారుపేరు' అనేది ట్యాగ్ లైన్. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అల్లూరి అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మరియు పోలీస్ వ్యవస్థ గురించి ఈ సినిమాలో చూపించారు. ఇందులో శ్రీ విష్ణు తొలిసారిగా ఖాకీ డ్రెస్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకూ పక్కింటి అబ్బాయి పాత్రలు చేసిన విలక్షణ నటుడు.. ఈసారి ఫెరోషియస్ పోలీస్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్య పరిచాడనే చెప్పాలి.
పోలీస్ అంటే మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలే కాదు.. తనలాంటి క్లాస్ ఇమేజ్ ఉన్న హీరో కూడా అలాంటి పాత్రలు చేయగలరని శ్రీ విష్ణు నిరూపించాడు. కొన్ని ఎపిసోడ్లలో అతని నటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సినిమా ఆద్యంతం అతను చూపించిన ఇంటెన్సిటీ ప్రశంసనీయమనే చెప్పాలి.
'అల్లూరి' కథాకథనాలు కాస్త బలహీనంగా ఉన్నా.. శ్రీ విష్ణు తన పెర్ఫార్మన్స్ తో సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. ఇది అతడి కెరీర్లో గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో ఒకటని చెప్పాలి. విష్ణు సిన్సియర్ అటెంప్ట్ కి ఆడియన్స్ నుంచి సిన్సియర్ అప్రిషియేషన్ దక్కుతోంది. అల్లూరిగా అతను అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
ఇక సెకండాఫ్ కొంచం బెటర్ గా ఉండి ఉంటే కచ్చితంగా మరో మంచి సినిమా అయ్యుండేది. అయినప్పటికీ శ్రీ విష్ణు సిన్సియర్ పెర్ఫామెన్స్ మరియు కొన్ని అద్భుతమైన ఎపిసోడ్లు జనాలను థియేటర్లకు రప్పిస్తుండటంతో.. బాగానే రన్ అవుతోంది. మరి ఈ వీకెండ్ లో 'అల్లూరి' సినిమా ఎంత వరకూ వసూలు చేస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.