మాస్ మ‌సాలాల‌కే శ్రీలీల పెద్ద పీఠ‌!

Update: 2023-06-14 20:00 GMT
యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతుంది. సీనియ‌ర్..జూనియ‌ర్స్ స్టార్స్ అంటూ ఎవ‌ర్నీ విడిచిపెట్ట‌డం లేదు. ఏ హీరోతో ఛాన్స్ వ‌చ్చినా సై అని ముందుకెళ్లిపోతుంది. ఓవైపు హీరోయిన్ గా న‌టిస్తూనే  మ‌రోవైపు సిస్ట‌ర్ రోల్స్..సెకెండ్ లీడ్ లంటూ  కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తుంది. అమ్మ‌డి తాజా లైన‌ప్ చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. తెలుగులో ఏ భామ లేనంత బిజీగా  ఉంది. డే బై డే  సొగ‌స‌రికి మార్కెట్లో మాస్ ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది.

తాజాగా ఈ అంశంపై ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.  క‌మ‌ర్శియ‌ల్ సినిమాల్లో ఉండే  మాస్ స‌న్నివేశాలు చాలా ఆస‌క్తిగా ఉంటాయి. అలాంటి  సినిమాలు చూడ‌టం అంటే చాలా ఇష్టం. ఇక న‌టించే ఛాన్స్ నా వ‌ర‌కూ వ‌స్తే విడిచి పెడ‌తానా? వెంట‌నే సైన్ చేసేయ‌ను' అని బ‌ధులిచ్చింది.

దీన్ని బ‌ట్టి మాస్ కంటెంట్ని అమ్మ‌డు ఏ రేంజ్ లో ఆస్వాదిస్తుందో చెప్పొచ్చు. పిట్ట చిన్న‌దైనా కూత ఘనం అన్న మాదిరి దూసుకుపోతుంది. అలాగే హీరోలంద‌రితో క‌లిసి న‌టించ‌డం గొప్ప ఎక్స్ పీరియ‌న్స్ గా రివీల్ చేసింది.

'న‌టించిన ప్ర‌తీ హీరో నుంచి ఏదో ఒక‌టి నేర్చుకుంటాను. ఏ హీరో ప్ర‌త్యేక‌త వారికుంది. వారి నుంచి సీక్రెట్ గా టెక్నికులు అడిగి తెలుసుకుంటాను. కొత్త వాళ్ల‌తో ప‌నిచేసే కొద్ది చాలా విష‌యాలు తెలుస్తున్నాయి.  నేను ఇంకా మంచి సినిమాలు చేయాలి. జీవితంలో వెన‌క్కి తిరిగి చూసుకుంటే మంచి సినిమాల‌తో కూడిన విజ‌యాలు క‌నిపించాలి. నేను చేసే ప్ర‌తీ సినిమా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోవాలి.

న‌టులు కావాల‌న్న ప్ర‌తీ ఒక్క‌రిని ప‌రిశ్ర‌మ ఆక‌ర్షిస్తుంది.  మంచి దారి చూపిస్తుంది.  సినీ క‌ల‌ల్ని సాకారం చేసుకునే వారికి ఇది స‌రైన స్థ‌లం. ఇందులో నేను భాగం కావ‌డం సంతోషంగా ఉంది 'అని అంది. ర‌ష్మిక మంద‌న్న త‌ర్వాత అంత వేగంగా పాపుల‌ర్ అయిన బ్యూటీగా శ్రీలీల క‌నిపిస్తుంది. న‌టిగా కొంత‌వ‌ర‌కూ స‌క్సెస్ అయితే త‌న‌దైన మార్క్ చ‌లాకీత‌నంతో వ్య‌క్తిగ‌తంగా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది.

Similar News