శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ నటవారసుడు రోషన్ మేక సరసన నటించింది శ్రీలీల. నటించిన తొలి చిత్రంతోనే తనదైన అందం నటనతో మెప్పించింది. అయితే సినిమా ఆశించినంతగా జనాలకు రీచ్ కాకపోవడం తనకు మైనస్. ఇకపోతే ఇటీవల ఈ బ్యూటీ అనూహ్యంగా వివాదంలోకి వచ్చింది. సదరు నటి తన కూతురేనా కాదా? అన్నది స్పష్టం చేసేందుకు పారిశ్రామికవేత్త సూరపనేని సుభాకరరావు అక్టోబర్ 17న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బెంగుళూరులో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న తెలుగు వ్యాపారవేత్త సుభాకరరావు శ్రీలీల తన మాజీ భార్య కుమార్తె అని అయితే ఆమె తననుంచి విడిపోయిన తర్వాత పుట్టిన బిడ్డ అని తెలిపారు. కాబట్టి ఆమె తన కుమార్తె కాదని పేర్కొన్నారు.
సుభాకర్ రావు తన పేరును పెళ్లిసందడి నటి తండ్రి అంటూ తప్పుగా ఉపయోగించడంపై కొన్ని ఆన్ లైన్ పోర్టల్ లు- యూట్యూబ్ ఛానెల్ లు ఇతర మాధ్యమాలను కూడా ప్రశ్నించారు. తప్పుగా రాయొద్దని అడిగారు! తన ప్రకటనల ప్రకారం.. 20 సంవత్సరాల క్రితం మొదటి భార్య నుంచి విడిపోయానని దానివల్ల తాను ఇప్పటికే చాలా కోల్పోయానని.. ఇప్పుడు తన పేరును ఎవరూ ఉపయోగించవద్దని అతను స్పష్టం చేశాడు.
కుటుంబ న్యాయస్థానం చాలా కాలం క్రితం తీర్పునిచ్చిందని అయినప్పటికీ శ్రీలీల తల్లి మరింత భరణం కోసం అనేక ఇతర ఉన్నత న్యాయస్థానాల్లో దీనిని వర్తింపజేస్తోందని ఆయన తెలిపారు. అందుకే విడాకుల కేసు ఇంకా కొన్ని కోర్టుల్లో పెండింగ్ లో ఉంది. ఇలా మీడియా ఇంటర్వ్యూలలో శ్రీలీలకు ప్రచారం పేరుతో తన పేరు వాడుకోవడం సరికాదని వాపోయారు. ఇది హానికరమైన ఉద్దేశాలతో కూడుకున్నది. అతని ఆస్తులలో మరింత వాటాను క్లెయిమ్ చేయడానికి మాత్రమే ఇలా చేస్తున్నారని ఆయన సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు.