టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ నానా హంగామా చేసిన శ్రీరెడ్డి ...ప్రస్తుతం కోలీవుడ్ లో పాగా వేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో కొందరు హీరోలు, దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి....అక్కడ కొన్ని సినిమా అవకాశాలు దక్కించుకుంది. కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి....తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన గురించి హీరో విశాల్ మాట్లాడుతున్నపుడు కీర్తి సురేష్ వెకిలిగా నవ్విందని - ఏదో ఒకరోజు తనలాంటి వారి బాధలు కీర్తికి అర్థమవుతాయని శ్రీరెడ్డి చెప్పింది. ఇపుడు శ్రీరెడ్డికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి కనుక ఏమీ అర్థం కావడం లేదని....అన్ని రోజులు ఒకలా ఉండవని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
`సందెకోళి-2' ఆడియో వేడుకలో శ్రీరెడ్డి గురించి విశాల్ మాట్లాడారు. ఆమెకు సినిమా ఆఫర్స్ వస్తున్నాయని, ప్రస్తుతం శ్రీరెడ్డి వివాదాలకు దూరంగా ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. అయితే, ఆమెతో పని చేసే వారు సేఫ్టీ కోసం కెమెరాలతో ఉండాలని, అలా చేస్తే ఆమెకు ఆటోమెటిక్‌గా రక్షణ లభించినట్లేనని అన్నారు. అదే వేదికపై ఉన్న కీర్తి....విశాల్ వ్యాఖ్యలకు నవ్వింది. దీనిని చూసిన శ్రీరెడ్డి....తన ఫేస్ బుక్ పేజీలో కీర్తిపై మండిపడింది. కీర్తి సురేష్ వెకిలి నవ్వు చూసి తనకు ఆమెపై అసహ్యం వేసిందని - ఇపుడు ఆమె టైమ్ బావుంది కాబట్టి మేఘాల్లో తేలిపోతోందని వ్యాఖ్యానించింది. కీర్తి ఎప్పుడూ ఇలాగే ఉండదని - ఏదో ఒకరోజు స్ట్రగులర్స్ బాధ తనకు అర్థమవుతుందని చెప్పింది. తన గురించి పాజిటివ్ గా స్పందించిన విశాల్ కు ధన్యవాదాలని - కానీ - తన చుట్టూ ఉన్న వారు కెమెరాలు ఎందుకు పెట్టుకోవాలన్నారో అర్థం కాలేదని చెప్పింది.