నాగశౌర్యపై మనసుపడ్డ సెక్స్ బాంబ్!

Update: 2020-02-02 17:30 GMT
శ్రీరెడ్డి తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు. ఆమె తీరు విభిన్నం.. ఆమె ప్రవర్తన అనూహ్యం.. ఆమె వ్యాఖ్యల శైలి అరాచకం.. ఆమె దెబ్బకు సోషల్ మీడియా అవుతుంది కుంభీపాకం. నిజానికి తెలుగువారిలో ఇలాంటి బోల్డ్ విప్లవవాదులు అతితక్కువ మంది ఉంటారు.  అందుకే శ్రీరెడ్డి జోలికి పోవాలంటే ఎలాంటి స్టార్ అయినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.  కారణం ఏంటంటే వారికి వీలైనంత బురద అంటుతుంది. ఆ బురద కడుక్కోవడానికి కనీసం నాలుగు నెలలు పడుతుంది. కొందరికి ఆ బురద సోషల్ మీడియాలో జీవితకాలం అంటిపెట్టుకుని ఉంటుంది.  ఈమధ్య శ్రీ రెడ్డి లో-ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తోందని.. వంటలు పిండివంటలు అనుకున్నారు కానీ సోషల్ మీడియా మంటలు ఆపలేదని స్లోగా జనాలకు అర్థం అయింది.

ఈమధ్యే యువ హీరో నాగశౌర్య నటించిన కొత్త సినిమా 'అశ్వథ్థామ' రిలీజ్ అయింది. ఎక్కువమందిపై విరుచుకుపడే శ్రీరెడ్డి ఎందుకో నాగశౌర్యపై తన చల్లని చూపులు ప్రసరింపజేసింది. "నాగశౌర్య లాంటి టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ హీరోను తొక్కేయకండిరా తొక్కలో మెగా హీరోస్ కోసం" అంటూ కామెంట్ చేసింది.  మెగా హీరోలకు 'తొక్కలో' అనే విశేషణం వాడితే మెగాభిమానుల మనోభావాలు దెబ్బతింటాయి కదా.. తిన్నాయి.  ఎప్పటిలాగే శ్రీరెడ్డిని తమదైన శైలిలో విమర్శలు చేస్తూ.. నువ్వన్నది నిజం కాదని వివరిస్తూ  తగులుకున్నారు.

ఇదంతా ఈ బోల్డ్ కామెంట్లకు ఒక కోణం. మరో కోణం ఏంటంటే కొందరు నెటిజన్లు ఈ మెగా గోల పక్కన పెట్టి శౌర్యపై స్పెషల్ స్టేటస్ ఇవ్వడం ఎందుకు.. ప్రత్యేక అభిమానం చూపించడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. టాలెంటెడ్ & హ్యాండ్సమ్ హీరోపై మనసు పడిన శ్రీరెడ్డి అంటూ కొందరేమో కామెంట్లు చేశారు.  మరి ఈ ప్రత్యేకమైన అభిమాని చూపిన ప్రత్యేక అభిమానం పట్ల శౌర్యగారి స్పందన ఉంటుందా.. లేక రేసుగుర్రం శృతి హసన్ లాగా ఈ విషయంపై స్పందనలు లోలోపలే పదిలంగా ఉంచుకుంటారా?
Tags:    

Similar News