మరోసారి నాని పై రెచ్చి పోయిన శ్రీరెడ్డి

Update: 2019-02-24 11:57 GMT
సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమద్య ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయిన శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి గతంలోనే నానిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరో నాని అంటూ గతంలో డైరెక్ట్‌ గానే విమర్శలు చేసిన ఈమె తాజాగా మరోసారి నానిపై రెచ్చి పోయి మరీ కామెంట్స్‌ చేసింది. అయితే ఈసారి హీరో నాని కాదు అంటూ ఇండైరెక్ట్‌ గా కామెంట్‌ చేసింది.

మా ఊర్లో ఒక నాని ఉండే వాడు, వాడు ఈమద్య పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిలు కనిపిస్తే చాలు వాడు దారుణంగా ప్రవర్తిస్తాడు. తాగుడుతో పాటు వాడికి డ్రగ్స్‌ అలవాటు కూడా ఉందని శ్రీరెడ్డి అంది. నాని భార్య గతంలో మీడియా ముందుకు వచ్చి ఖండించింది కదా మరి ఆ విషయం ఏంటీ అంటూ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్‌ ప్రశ్నించగా శ్రీరెడ్డి స్పందిస్తూ ఒక ఆడది అవ్వడం వల్ల ఊరుకున్నాను లేదంటే ఆమెను రోడ్డుకు ఈడ్చేదాన్ని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి శ్రీరెడ్డి మరోసారి నానిపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగుతోంది.
Tags:    

Similar News