హీరో భార్య‌పై శ్రీ‌రెడ్డి బాంబ్

Update: 2019-03-09 04:13 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల వేళ ర‌స‌వ‌త్త‌ర‌మైన డ్రామా న‌డుస్తోంది. మార్చి 10న మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా శివాజీ రాజా ప్యానెల్.. న‌రేష్ ప్యానెల్ ఎవ‌రికి వారు ఆర్టిస్టుల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆర్టిస్టుల‌ను క‌లిసి ఓట్లు అడుగుతున్నారు. స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్ర‌వేశించిన శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. గ‌త ఏడాది సంఘం అధ్య‌క్షుడు శివాజీ రాజా త‌న‌కు `మా`లో మెంబ‌ర్ షిప్ ఇవ్వ‌లేద‌ని - కాస్టింగ్ కౌచ్ విష‌యంలో త‌న‌కు అండ‌గా నిల‌వ‌లేద‌ని అసోసియేష‌న్ ముందే వివ‌స్త్ర‌గా మీడియాకెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే ఉన్న‌ట్టుండి శ్రీ‌రెడ్డికి ఏమైందో ఈసారి మాట మార్చింది. అప్పుడు నాకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌నందుకు అత‌డిపై కోపం ఉన్న మాట నిజ‌మే. కానీ ఇప్పుడు అర్హ‌త లేని వారి చేతిలోకి మా అసోసియేష‌న్ వెళ్లిపోతోంది. ఇలాంట‌ప్పుడు ఈగోను ఎందుకు ప‌క్క‌న పెట్ట‌కూడ‌దు అనిపించి శివాజీరాజానే మ‌రోసారి అధ్య‌క్షుడిని చేయాల‌ని కోరుతున్నాను అంటూ అస‌లు ట్విస్టిచ్చింది.

ఓవైపు శ్రీ‌రెడ్డి విష‌యంలో `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా స‌రైన స‌పోర్ట్ ఇవ్వ‌లేద‌ని వాదిస్తున్న ప్యానెల్ కి వ్య‌తిరేకంగా శ్రీ‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యానం చేయ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది. అంతేకాదు న‌రేష్ ప్యానెల్ ని విమ‌ర్శిస్తూ హీరో భార్య‌పైనా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఉత్కంఠ‌ రేపుతోంది. ఓ యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన శ్రీ‌రెడ్డి ``హీరో భార్య‌.. అమ్మాయిలు`` అంటూ అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల్ని చేశారు. న‌రేష్ ప్యానల్‌ లో ఎంచుకున్న మనుషులు సరైన వారు కాదు. ఆయన శివాజీ రాజా ప్యానల్ మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు. కానీ తగిన ఆధారాలతో క్లారిటీ ఇవ్వడం లేదని శ్రీరెడ్డి అన్నారు. `ఆ హీరో భార్య దగ్గర ఉండి పంపిస్తుంది` అంటూ వ్యాఖ్యానించ‌డం హీట్ పెంచుతోంది.

వందల కోట్ల ఆస్తులు.. పెద్ద పెద్ద ఖరీదైన కార్లు.. బంగ్లాలు ఉన్న మీరు ఇప్పటి వరకు `మా`లో ఓ పోస్ట్ వెలగబెట్టారు. కానీ ఎవరికీ సాయ‌ప‌డ‌లేదు. మీకు పదవి కావాలి.. కానీ సేవలు సున్నా! అంటూ న‌రేష్ పైనా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాస్టింగ్ కౌచ్ విష‌యంలో శివాజీ రాజా మీద నేను అలిగిన మాట నిజమే. అసోసియేషన్ ముందు ధర్నా చేసినపుడు నాకు సపోర్ట్ చేయలేదని.. వ్యతిరేకంగా మాట్లాడారని కోపం ఉండేది. కానీ ఇపుడు `మా`ను తీసుకెళ్లి అర్హత లేని వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతుంటే మంచి వ్యక్తిని మంచి వ్యక్తి అనడానికి నాకు అహంకారం ఎందుకు అడ్డురావాలి? శివాజీ రాజా ప్యానల్ ఈ ఎన్నికల్లో దిగ్విజయంగా గెలుపొందాలని కోరుకుంటున్నాను.. అంటూ శ్రీ‌రెడ్డి ఇచ్చిన ట్విస్టుపై ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారంతా.


Full View


Tags:    

Similar News