శ్రీదేవి ఈ లోకం వదిలి వెళ్లి రెండు వారాలు దాటుతున్నా జ్ఞాపకాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అనుకోని దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో డై హార్డ్ ఫాన్స్ ఇంకా షాక్ నుంచి పూర్తిగా బయటికి రాలేకపోతున్నారు. తాజాగా బోని కపూర్ - అనిల్ కపూర్ - డిజైనర్ మనీష్ మల్హోత్రా కలిసి హరిద్వార్ లో శ్రీదేవి అస్తికలను నిమజ్జనం చేసారు. అదేంటి రామేశ్వరంలో మొన్నే చేసారుగా మళ్ళి ఇదేంటి అనే అనుమానం రావొచ్చు. 1993లో ఒక సినిమా షూటింగ్ కోసం హరిద్వార్ కు దగ్గరే ఉన్న శ్రీదేవి ఎంత ప్రయత్నించినా దైవ దర్శనానికి వెళ్ళలేకపోయింది. బోనీతో పెళ్లి జరిగాక కూడా అది నెరవేర్చుకోవడం సాధ్యం కాలేదు. ఇది పలుమార్లు తనతో చెప్పడం బోనీకి బాగా గుర్తుంది. అందుకే మొదటి క్రతువు రామేశ్వరంలో పూర్తి చేసాక ఇప్పుడు హరిద్వార్ లో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం చేసి తన ఆఖరి కోరిక తీర్చాడు. అనిల్ కపూర్ శ్రీదేవి మరణించిన రోజు నుంచి అన్నను అంటిపెట్టుకునే ఉన్నాడు.
వివిఐపి ఘాట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ వ్యవసాయ శాఖా మంత్రి సుబోద్ ఉనియాల్, హరిద్వార్ నగర మేయర్ మనోజ్ గార్గ్, రాజ్య సభ సభ్యుడు అమర్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు. శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన అన్ని పూజా కార్యక్రమాలు ఎన్నో ఏళ్ళుగా నిర్వహిస్తున్న శివ కుమార్ - మనిష్ లు కూడా వీరి వెంట ప్రతి విధిని నిర్వర్తిస్తున్నారు. శ్రీదేవికి సంబంధించి బహుశా ఇదే చివరి కార్యక్రమం కావొచ్చు. రామేశ్వరంలో చేసిన నిమజ్జనానికి జాన్వీ, ఖుషిలు కూడా హాజరు కాగా ఈ సారి ధడక్ షూటింగ్ సందర్భంగా జాన్వీ రాలేకపోయింది. అక్కకు తోడుగా ఖుషి కూడా ముంబైలోనే ఉండిపోయింది. ఉన్నప్పుడు హరిద్వార్ వెళ్ళాలనుకున్న శ్రీదేవి కోరిక చివరికి ఇలా పోయాక చితా భస్మం రూపంలో వెళ్ళాల్సి రావడం విధి విచిత్రం