ఫిలిం ఫేర్ గ్లామర్ అవార్డుల పేరుతో ముంబయిలో ఒక కార్యక్రమం జరిగింది నిన్న రాత్రి. అక్కడికి చాలామంది యంగ్ హీరోయిన్లు వచ్చారు. బాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరోయిన్లూ వచ్చారు. కానీ అందరిలోకి హైలైట్ అయింది ఎవరయ్యా అంటే.. 54 ఏళ్ల శ్రీదేవి. ఈ వయసులో ఆమె హాట్ నెస్ చూసి అందరూ నోరెళ్లబెట్టారు. యువరాణి తరహాలో డిజైనర్ గౌను ధరించి.. అందాలు ఆరబోస్తూ శ్రీదేవి తయారై వచ్చిన తీరుకు అందరూ షాకైపోయారు. ఓవైపు తన కూతుర్ని కథనాయికగా పరిచయం చేస్తూ.. శ్రీదేవి ఇంత గ్లామరస్ గా కనిపించాల్సిన అవసరం ఏంటి అని కొందరు సెటైర్లు వేసినా.. ఇంకొందరు మాత్రం ఈ వయసులోనూ ఈ శరీర సౌష్టవం ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోయారు.
ఏదేమైనా 50 ప్లస్ వయసులో ఇంత హాట్ గా కనిపించిన హీరోయిన్ ఇండియాలో మరొకరు లేరు అనడంలో మాత్రం సందేహం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’.. ‘మామ్’ లాంటి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన శ్రీదేవి.. అవసరమైతే గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అని స్టేట్మెంట్ ఇస్తున్నట్లుంది ఆమె తాజా లుక్ చూస్తే.