బాయ్ ఫ్రెండ్ తో కలిసే వచ్చిన శ్రీ కూతురు

Update: 2016-11-24 14:33 GMT
మాజీ అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే ఈ చిన్నది ఓ లవ్ ఎఫైర్ లో ఉందనే టాక్ ఉంది. కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు  శిఖర్ పహరియాతో జాన్వీతో ప్రేమలో మునిగి తేలుతున్నాడనే వార్తలు ఉన్నాయి.

ఇప్పటివరకూ ఇది రూమర్ మాత్రమే అయినా.. రీసెంట్ గా డియర్ జిందగీ మూవీ స్క్రీనింగ్ కి.. జాన్వి-శిఖర్ లు చెట్టాపట్టాలు వేసుకుని రావడంతో అందరూ ఖంగుతిన్నారు. పైగా మనోడు శ్రీదేవి ఫ్యామిలీతోనే కలసి వచ్చేయడం అనేది ఇంకా హాట్ టాపిక్ అయిపోయింది. గతంలో జాన్వితో కలసి ముద్దుల ఫోటోలు హగ్గుల సెల్ఫీలు కూడా దిగాడు ఈ కుర్రాడు. చూస్తుంటే ఫ్యామిలీ అందరూ ఆల్రెడీ ఈ ఫ్రెండ్(లవ్)షిప్ కు ఓకె చెప్పేసినట్లున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లవ్ ఎఫైర్ లు ఉండకూడదని జాన్వికి శ్రీదేవి ఒక రూల్ పెట్టిందనే టాక్ అప్పట్లో వచ్చింది. మరి ఇప్పుడు పబ్లిక్ గానే శిఖర్ తో జాన్వి కనిపించడంతో.. పైగా పక్కనే శ్రీదేవి ఉండటం.. అసలు అలాంటి రూల్ ఏమీ పెట్టలేదనే అనుకోవాలి. చూస్తుంటే శిఖర్ తో రిలేషన్ కి మామ్ అండ్ డాడ్ కూడా జాన్వీకి ఓకే చెప్పేసినట్లే ఉంది సీనంతా.

సాధారణంగా బాలీవుడ్ లో హీరోయిన్స్ ఎఫైర్స్ ను మొదట్టలో గుట్టుగా ఉంచి.. తరువాత ఓపెన్ చేస్తుంటారు. అయితే జాన్వి ఇలాంటి వాటిని పట్టించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ప్రారంభం నుంచే అన్నీ ఓపెన్ గా చేసేస్తూ.. తన స్టైల్ వేరే అని ఇండికేషన్స్ ఇచ్చేస్తోందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News