బడిలో శ్రీదేవి యాక్టింగ్ పాఠాలు

Update: 2017-12-07 13:12 GMT
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో నటనను కనబరిచి.. అందంతో భారతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ శ్రీదేవి. అమ్మడి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక యాక్టింగ్ స్కిల్స్ లో తనకు తానే సాటి. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలను చేసిన శ్రీదేవి పై అభిమానం ఇంకా చాలామందికి ఉంది. అయితే ఒక అభిమాని మాత్రం శ్రీదేవి గుర్తుగా ఏకంగా ఆమె పేరు మీద ఒక యాక్టింగ్ స్కూల్ ని ఏర్పాటు చేయబోతున్నాడు.

బాలీవుడ్ - కోలీవుడ్ అండ్ టాలీవుడ్ సైడ్ ఆ స్కూల్స్ బ్రాంచెస్ ఉండాలని ఆలోచిస్తున్నారట. శ్రీదేవి ఫ్యాన్  అనిష్ నాయర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ఈ స్కూల్స్ లో స్పెషల్ ఏమిటంటే.. ఇందులో కేవలం శ్రీదేవి పాటలను యాక్టింగ్ సీన్స్ ని సిలబస్ గా పెడతారట. ఇక కొంత మంది పేద పిల్లలకు ఫ్రీగా కూడా కోచింగ్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీదేవి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. ఆమె కూడా చాలా సంతోషపడ్డారు. నా అభిమాని ఇలాంటి మంచి కార్యక్రమాన్నీ స్టార్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా.

అలాగే పేద పిల్లలకు కూడా ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం మంచి విషయమని ఇటీవల ఒక మీడియా ఛానెల్ తో చెప్పారు. ఇక మొదట ఆ కోచింగ్ స్కూల్స్ ని చెన్నై లో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. మొదటి బ్రాంచ్ ఆమె చేతుల మీదగా స్టార్ట్ చేస్తారట. అంతే కాకుండా శ్రీదేవి వీలైనంత వరకు తను కూడా టీచర్ గా మారి పిల్లలకు నటనలో శిక్షణను ఇస్తుందట. ముంబై - హైదరాబాద్ - ఢిల్లీ అండ్ కలకత్తా వంటి ముఖ్య నగరాల్లో ఈ స్కూల్స్ ని స్టార్ట్ చెయ్యాలని అనిష్ నాయర్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
Tags:    

Similar News