అందాల తార శ్రీదేవి మనల్ని వదిలిన రెండు నెలల తర్వాత మళ్ళి జ్ఞాపకాల్లోకి వచ్చారు. ఈ రోజు ప్రకటించిన 65వ జాతీయ అవార్డుల్లో శ్రీదేవికి ఉత్తమ నటి పురస్కారం దక్కడం అభిమానుల గుండెలను మరోసారి బరువెక్కేలా చేసింది. తన జీవితం మొత్తం నటనకే అంకితం చేసి తను చనిపోయే క్షణం వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్న శ్రీదేవికి సరైన గుర్తింపే దక్కింది కాని అది అందుకోవడానికి ఆమె లేకపోవడం హృదయాలు ద్రవించేలా చేస్తోంది. తన కూతురికి జరిగిన అన్యాయానికి పోరాడే సవతి తల్లి పాత్రలో మామ్ సినిమాలో శ్రీదేవి నటన విమర్శకులను సైతం మెప్పించింది. క్రిటిక్స్ కూడా ఇంత మంచి నటి ఎక్కువ కాలం సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉండటం పట్ల ఆక్షేపించారు కూడా. అంతటి నటనా ప్రతిభ ఉన్న నటి కాబట్టి ఘన నివాళి అందుకుని వెళ్ళిపోయారు.
మామ్ సినిమా దర్శకుడు రవి ఉద్యావర్. నవాజుద్దిన్ సిద్దిక్ ఈ సినిమాతోనే మొదటిసారి శ్రీదేవి తో కలిసి నటించాడు. ఈ సంవత్సరం శ్రీదేవి లేకపోయినా తన ఫ్యామిలీకి మాత్రం తీపి చేదు సమ్మేళనంగా ఉండబోతోంది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ డెబ్యు మూవీ ధడక్ జూన్ లో విడుదల కానుండగా భర్త బోనీ కపూర్ శ్రీదేవి స్మృతిలో నిర్మించబోయే డాక్యుమెంటరీ తరహా ఫీచర్ ఫిలిం కూడా త్వరలో షూటింగ్ ప్రారంభించుకోబోతోంది. ఇప్పుడు ఈ పురస్కారాన్ని శ్రీదేవి తరఫున బోనీ కపూర్ అందుకోబోతున్నాడు. కాకతాళీయం ఏంటంటే 80వ దశకంలో బోనీ కపూర్ నిర్మించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ మిస్టర్ ఇండియాతోనే శ్రీదేవి సూపర్ స్టార్ గా మారింది. దానికి దర్శకుడు శేఖర్ కపూర్. ఇప్పుడు అతనే అవార్డు కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను ఎంపిక చేసిన అవార్డునే బోనీ తీసుకోబోతున్నాడు. ఎంత విధి విచిత్రమో కదా.