అతిలోక సుంద‌రి శ్రీదేవి నికర విలువ రూ.250 కోట్లు?

Update: 2021-08-13 12:24 GMT
అతిలోక సుంద‌రి శ్రీదేవి భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సంచ‌ల‌నం. అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న మేటి క‌థానాయిక‌గా ఉత్త‌రాది ద‌క్షిణాది చిత్ర‌సీమ‌ల్ని ఏలిన న‌టి. బాలీవుడ్ లోనే కాదు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో కూడా తనదైన ముద్ర వేసింది. శ్రీ‌దేవి ఆక‌స్మికంగా మరణించినప్పుడు బాలీవుడ్ లో తన రెండవ ఇన్నింగ్స్ స‌క్సెస్ ని ఆస్వాదిస్తోంది. 2018 ఫిబ్రవరి 24 న దుబాయ్ లో ఓ హోట‌ల్లో శ్రీ‌దేవి బాత్ ట‌బ్ లో కాలు జారి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిన‌దే. ప్రమాదవశాత్తు మునిగిపోవడమే ఈ మరణానికి కారణమని పోలీసులు రికార్డును క్లోజ్ చేశారు.

అయితే ఈ ద‌ర్యాప్తును అభిమానులు ఇప్ప‌టికీ న‌మ్మ‌డం లేదు. ఇది అనుమానాస్ప‌ద న‌టి అని వాదించే వాళ్లు లేక‌పోలేదు. శ్రీ‌దేవికి దుబాయ్ లో భారీ ఇన్సూరెన్స్ ఉంద‌ని అందుకే మ‌ర‌ణం సంభ‌వించింద‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఇక శ్రీ‌దేవి భర్త బోనీ కపూర్ తో సంయుక్తంగా భాగ‌స్వామ్యంలో శ్రీ‌దేవి చాలా ఆస్తులు కలిగి ఉన్నారు. ఆమె జయంతి సందర్భంగా ఆమె నికర విలువ గురించి అభిమానుల్లో చ‌ర్చ సాగింది.

ఓ మీడియా నివేదిక ప్రకారం శ్రీ‌దేవి మరణించే సమయంలో ఆమె అస్సెట్స్ విలువ $ 35 మిలియన్లు. ఇది సుమారు రూ .250 కోట్లకు పైగా ఉంటుంది. అయితే ఆమె నికర విలువ ఆమె భర్త బోనీ కపూర్ తో కలిపి ఉంది. శ్రీ‌దేవి అనేక లగ్జరీ వాహనాలు ఇత‌ర ఆస్తుల‌ను కలిగి ఉన్నారు. బోనీతో క‌లిసి లెక్కలేనన్ని ఇతర పెట్టుబడులు శ్రీ‌దేవి పెట్టారు. ఆమె బాలీవుడ్ లో విజయవంతంగా పునరాగమనం చేసిన తర్వాత  అత్యధిక పారితోషికం తీసుకునే తారలలో ఒకరిగా నిలిచేంత‌గా దూసుకెళ్లారు. ఆమె ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమలో షాక్ వేవ్స్ ని క్రియేట్ చేసింది.  ప్రజలు ఈ వార్తలను నమ్మలేకపోయారు.

కొంతకాలం శ్రీ‌దేవి మరణం గురించి అనేక కుట్ర సిద్ధాంతాలు వెలుగు చూశాయి. కానీ ఆమె శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు కనిపించాయని ఆమె ఊపిరితిత్తులలో నీరు కనిపించిందని ప్రమాదవశాత్తు మునిగిపోవడమే కారణమని అధికారిక టాక్సికాలజీ నివేదిక వెల్లడించింది. తన కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న ధడక్ చూడటానికి ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న త‌రుణంలో ఈ మ‌ర‌ణం క‌ల‌చివేసింది. ఆమె కుమార్తె ఖుషి కూడా త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న సంగ‌తి తెలిసిన‌దే.

మేటి క‌థానాయిక శ్రీ‌దేవి 1967 లో తమిళ చిత్రం కందన్ కరుణైలో 4 సంవత్సరాల వయస్సులో బాలనటిగా తన కెరీర్ ని ప్రారంభించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమె అనేక చిత్రాల్లో నటించింది. ఆ త‌ర్వాత క‌థానాయిక‌గా తెలుగు త‌మిళంలో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించారు. హిందీలోనూ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో శ్రీ‌దేవి న‌టించారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం మూండ్రు ముడిచులో ప్రధాన నటిగా అరంగేట్రం చేసింది. 1979 లో సోల్వా సవన్ లో శ్రీదేవి తొలిగా బాలీవుడ్ అరంగేట్రం జరిగింది. ఆమె హిమ్మత్ వాలాలో జితేంద్ర సరసన నటించారు. ఇది తెలుగు సినిమా ఊరుకి మొనగాడుకి రీమేక్. ఈ సినిమా భారీ హిట్ అయింది. అలా శ్రీదేవి విజయవంతమైన బాలీవుడ్ ప్రయాణం ప్రారంభమైంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టించిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ సాధించింది. ఆ సినిమా టైటిల్ లోని అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఇంటి పేరైంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
Tags:    

Similar News