శ్రీదేవి మరణించి నాలుగు రోజులవుతున్నా ఇంకా ఆమె అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇక ఆమెతో వ్యక్తిగత అనుబంధం ఉన్న ఫిలిం సెలబ్రెటీల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. శ్రీదేవితో ‘ఆఖరి పోరాటం’.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.. ‘గోవిందా గోవిందా’ లాంటి మెమొరబుల్ సినిమాలు తీసిన సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ను ఆమె మరణం తీవ్రంగా కలచివేసింది. శ్రీదేవి లేదన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పిన అశ్వినీదత్.. శ్రీదేవి అంత్య క్రియల సందర్భంగా ఆమె కూతుళ్లు జాన్వి.. ఖుషిల ముఖాలు చూడలేకపోయానని అన్నారు.
తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాల్లో శ్రీదేవితో ఉన్న జ్ఞాపకాల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి కమిట్మెంట్ ఎలాంటిదో చాటి చెప్పే ఒక సంఘటనను ఆయన పంచుకున్నారు. ‘గోవిందా గోవిందా’ షూటింగ్ తిరుపతిలో జరుగుతున్నపుడు శ్రీదేవి అదుపు తప్పి కింద పడటం వల్ల ఆమె పెదవి చిట్లిందట. చాలా రక్తం కూడా వచ్చిందట. ఆమెను చెన్నైకి తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చూపిద్దామని అశ్వినీదత్ ఏర్పాట్లు చేస్తే.. శ్రీదేవి మాత్రం తన వల్ల షూటింగ్ డిస్టర్బ్ కాకూడదన్న ఉద్దేశంతో ఆయన్ని ఆపిందట. లోకల్ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స చేయించుకుని.. నొప్పిని భరిస్తూనే షూటింగ్ లో పాల్గొందట. పెదవి చిట్లిన విషయం తెలియకుండా మేకప్ తో కవర్ చేసిందట. అప్పుడు శ్రీదేవి ఉన్న స్థాయిలో మరొకరైతే అలా చేసుండేవాళ్లు కానీ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణమే ఆమెను మరింత ఉన్నత స్థితికి చేర్చిందని అశ్వినీదత్ అన్నారు.