శ్రీదేవి అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడిచాక కూడా తన జ్ఞాపకాలు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో తనకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తు ఉండటంతో అవి చూసిన ప్రతి సారి హృదయం బరువెక్కుతోంది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో హోలీ పండగ జరుగుతుండగా, మరో కొన్ని చోట్ల రేపు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి గత ఏడాది తాను నివసించిన గ్రీన్ ఎకర్స్ ప్రాంతంలో హోలీ పండగ జరుపుకుంటూ రంగుల్లో మునిగి తేలుతూ ఉండగా తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫాన్స్ ని కంటతడి పెట్టిస్తోంది. చెక్కుచెదరని అందానికి నిర్వచనంగా నిర్జీవ దేహంలోనూ చక్కని కళతో ఆశ్చర్యపరిచిన శ్రీదేవిని నగుమోములో హోలీ రంగుల్లో చూసేందుకు మాత్రం రెండు కళ్ళు చాలవు.
ఇందులో అందరిని ఆకర్షిస్తోంది మరొకటి ఉంది. తనకు ఎంతో ఇష్టమైన వైట్ కలర్ సారీ, స్లీవ్ లెస్ బ్లౌస్ లో వెనక్కు తిరిగి ఒక అరనవ్వు విసురుతుండగా, వీపుపై ఎర్రని రంగులో బోనీ అని రాయించుకోవడం తనకు భర్త మీద ఎంత ప్రేమ ఉందో సజీవ సాక్ష్యంగా ఇది నిలబడింది. బోనీ కపూర్ తాను శ్రీదేవిని ఎంతగా మిస్ అవుతున్నాడో లేఖ రూపంలో ఆవేదనను వ్యక్తపరిచి ఒక రోజు కూడా గడవక ముందే అది ఋజువు చేయడానికి అన్నట్టు ఇది ఇప్పుడు బయటికి రావడం అందరిని కలచి వేస్తోంది. కపూర్ ఫ్యామిలీ ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. తననే తలుచుకుంటూ శ్రీదేవి తలపులోనుంచి బయటికి రాలేకపోతున్నారు.
శ్రీదేవి మృతికి నివాళిగా ఆమె నివసించే ప్రాంతం మొత్తం హోలీ వేడుకలు చేసుకోకూడదని అక్కడి ప్రజలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారు. పలువురు బాలీవుడ్ నటీనటులు సైతం రంగుల్లో మునిగి తేలడం ఇష్టం లేక సంబరాలు రద్దు చేసుకున్నారు. శ్రీదేవి హీరొయిన్ కాదు ఒక శకం అనే నిజం చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోతుంది అని ఒక ప్రముఖ బాలీవుడ్ రచయిత అన్న మాటలు అక్షరాల నిజం.