అతిలోక సుందరి.. తట్టుకోలేం బాబోయ్‌

Update: 2015-06-23 11:59 GMT
మనకో మహా చెడ్డ అలవాటుంది. అలనాటి అందాల రాణులకు వయసు మీద పడినా.. ఆ సంగతి గుర్తించడానికి మనం ఇష్టపడం. 'వయసు పెరిగినా వన్నె తరగని అందం' అంటూ హిపోక్రటిక్‌ కబుర్లు భలే చెబుతాం. ఐశ్వర్యారాయ్‌కి 40 ఏళ్లు వచ్చినా.. ఆమెలో మునుపటి గ్లో మిస్సయినా.. ఇప్పటికీ ఆమెను ప్రపంచ సుందరిలాగే భావిస్తాం. అందానికి నిర్వచనం అంటూ ఆమెనే ఉదాహరణగా చూపిస్తాం. ఐశ్వర్య అయినా ఇంకా 40ల్లో పడలేదు కాబట్టి ఓకే. కానీ 50 ఏళ్లు దాటిన శ్రీదేవి మనకిప్పటికీ అతిలోక సుందరే. 60 ప్లస్‌లో ఉన్న హేమమాలిని ఇప్పటికీ డ్రీమ్‌గర్లే.

శ్రీదేవి మనమ్మాయి అనే ఫీలింగ్‌ కాబట్టి ఆమె మీద అభిమానం కొంచెం ఎక్కువే చూపిస్తాం. కానీ మన రాజమౌళి తన 'బాహుబలి'లో శివగామి పాత్ర కోసం శ్రీదేవిని అడిగితే ఆమె కుదరదు పొమ్మన్నారట. అప్పటికి ఆమె 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'తో రీఎంట్రీ కూడా ఇచ్చింది. పోనీ సౌత్‌ సినిమాల్లో నటించడం ఇష్టం లేక ఒప్పుకోలేదేమో అనుకోవడానికేమీ లేదు. రాజమౌళి ఆఫర్‌ను తిరస్కరించాక ఎంచక్కా తమిళ 'పులి' సినిమాకు ఓకే చెప్పింది. మరి రాజమౌళి ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించిందో ఆమెకే తెలియాలి. బాహుబలి సినిమాకు శివగామి పాత్ర హైలైట్‌ కాబోతోందని శ్రీదేవికి కూడా బాగానే అర్థమవుతున్నట్లుంది. ఇక శ్రీదేవి నటించిన 'పులి' టీజర్‌ మొన్నే రిలీజైంది. అందులో సౌమ్యాదేవి అనే రాణి పాత్ర పోషించింది శ్రీదేవి. ఆ క్యారెక్టర్‌లో శ్రీదేవిని చూస్తే డోకు రావడం గ్యారెంటీ. విపరీతమైన మేకప్‌ పులుముకుని చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా తయారైందామె. కానీ పైన చెప్పుకున్నట్లే జనాలు మాత్రం 'వారెవా ఏమందం ఏమందం.. శ్రీదేవి నిజంగా అతిలోక సుందరే' అంటూ పూనకం తెచ్చేసుకుంటున్నారు.

Tags:    

Similar News