ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ముఖ్యమంత్రి జయలలిత మరణంతో పార్టీపై ఆధిపత్యం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలే జరుగుతున్నాయి. తమిళ రాజకీయాలన్నీ శశికళ చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళను కలుసుకున్నారు ప్రముఖ నటి శ్రీదేవి. అమ్మ మరణం తరువాత శశికళను ఆమె చెన్నైకి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మేరకు ఎ.ఐ.డి.ఎమ్.కె. వర్గాలు ఒక ఫొటోను మీడియాకు విడుదల చేశాయి. జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ లో శశికళను శ్రీదేవి కలుసుకున్నారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అయితే, ఈ భేటీకి సంబంధించి ఎలాంటి వివరాలను పార్టీ వర్గాలు బయటకి చెప్పడం లేదు. మర్యాదపూర్వంగానే శ్రీదేవి ఆమెను కలుసుకున్నారు అంటున్నారు. శశికళను కలుసుకున్న తరువాత ఎంజీఆర్ మెమోరియల్ కు వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శ్రీదేవి నివాళులు అర్పించారు.
శశికళతో శ్రీదేవి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. శ్రీదేవి బాలనటిగా ఉన్నప్పుడు జయలలిత సినిమాల్లో నటించారనీ, దాంతో అమ్మపై ఉన్న గౌరవాభిమానాలు కారణంగానే శ్రీదేవి నివాళులు అర్పించడానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ భేటీకి ఏదైనా రాజకీయ ప్రాధాన్యం ఉందంటారా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/