శ్రీదేవి మామ్.. ఢాం అన్నట్లేనా??

Update: 2017-07-11 12:53 GMT
గత జనరేషన్ కు అందాల తార శ్రీదేవి మళ్ళీ పూర్తి స్థాయి యాక్టింగ్ మొదలుపెట్టేసినట్లు కనిపిస్తోంది. ‘ఇంగ్లిష్ వింగ్లీష్’ తో రీ ఎంట్రీ ఇచ్చాక.. మూడేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన ‘మామ్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని స్థాయిలో శ్రీదేవి ప్రచారం చేసింది. హిందీతో పాటుగా సౌత్ లో కూడా ఈ సినిమాను విడుదల చేయగా.. మామ్ సినిమాకు ఒక్కో ఏరియాలో ఒక్కో టైపులో టాక్ వచ్చింది. పబ్లిసిటీ హంగామా ఎలా ఉన్నా.. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న మాట నిజం. తెలుగులో అయితే మామ్ సినిమాకి ఫ్లాప్ టాక్ మాత్రమే వచ్చింది.

మామ్ సినిమా హింది వర్షన్ ఇప్పుడు బాగానే పుంజుకుందని చెబుతున్నారు. వీకెండ్ వరకు కలెక్షన్ 14 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటిరోజు కేవలం 2 కోట్లు కలెక్ట్ చేసి నిరాశ పరిచిన ఈ మూవీ.. శనివారం 5 కోట్లు.. ఆదివారం 7 కోట్లు కలెక్ట్ చేసి మెరుగుపడింది. హిందీలో ఇలా నడుస్తుంటే తెలుగులో మాత్రం మన ప్రేక్షకులు ఇప్పటికి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. తెలుగులో ఈ మూవీని చూడాలంటే ఒకే ఒక్క ఫ్యాక్టర్ శ్రీదేవి.

రవి ఉద్యవర్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేసిన మామ్ కథా రచయిత..  తెలుగు రైటర్ కోన వెంకట్. శ్రీదేవి తో పాటుగా అక్షయ్ ఖన్నా - నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి తన కూతురుకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే అమ్మగా కనిపిస్తుంది. శ్రీదేవి కూతురుగా పాకిస్తాన్ నటి సజల్ ఆలీ నటించింది. శ్రీదేవి నటనను క్రిటిక్స్ తెగ మెచ్చేసుకుంటున్నారు కానీ.. జనాలే మీడియా మాటలను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.
Tags:    

Similar News