శ్రీదేవి లీడ్ రోల్లో నటించిన సినిమా ‘మామ్’ నిన్న విడుదలైంది. ఈ సినిమా కోసం శ్రీదేవి అన్ని రాష్ట్రాల ఇంస్ర్టీలకు వెళ్ళి ‘మామ్’ సినిమా ప్రచారం చేసింది. తను నటించిన, భర్త బోణి కపూర్ ప్రొడ్యూస్ చేసిన మామ్ సినిమా ఒక్కో చోటా ఒక్కో రకంగా స్పందన వస్తుంది. ఈ సినిమా ముందు నుండి చెప్పినట్లే ఒక అమ్మ తన కూతురు కోసం చేసిన పోరాట కథే. శ్రీదేవి కూతురు ఒక అత్యాచారంకు గురి అవుతుంది. కానీ నేరం ఆరోపించబడిన వాళ్ళు మాత్రం సమాజపు కళ్ళు కప్పి తప్పించుకుంటారు. శ్రీదేవి అప్పుడు వారిని చంపేస్తుంది. ఇదే టూకీగా కథ.
సినిమాలో తల్లీకూతురు మధ్య బంధం బాగానే చూపించినా.. కొన్ని చోట్ల మెలోడ్రామా ఎక్కువ అయ్యింది అనిపించిన శ్రీదేవి.. దాన్ని తన నటనదక్షత తో నెట్టుకువచ్చింది. కాకపోతే చాలాచోట్ల కథ లాజిక్ తప్పిందనే అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఒక నడి వయసులో ఉన్న సాదారణ స్ర్తీ ఇలాంటి క్రిమినల్ బ్రెయిన్ తో ఆలోచించి పెద్ద రాజకీయ పలుకుబడి ఉన్న వారిని ఎలా ఎదుర్కోవడానికి సిద్దపడింది, పైగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఎలా చేయగలిగింది అనేది చూసే వాళ్ళకు రుచించలేదు.
శ్రీదేవి తన కారెక్టర్ వరకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. ఈ సినిమాలో మరో టాలెంటెడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికి పాత్ర సినిమాకు ఒక స్పెషల్ ఆఫర్లా ఉపయోగపడింది. తన గగుర్పాటు కలిగించే నటనతో అందరినీ మెప్పించాడు. డిటెక్టివ్ రోల్ లో నవాజుద్దీన్ పూర్తి స్థాయి న్యాయం చేశాడు. అలానే అక్షయ్ ఖన్నా కూడా తనవంతు పాటు పడ్డాడు. కథ చెప్పే పద్దతి ప్రేక్షకులుకు అంతాగా నచ్చలేదు అని చెబుతున్నారు. బాలీవుడ్ లో ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. చూద్దాం మరి ఈ సినిమా రిజల్టు ఎలా ఉండబోతుందో.