దాసరి మరణాన్ని పట్టించుకోని శ్రీదేవి

Update: 2017-06-01 10:20 GMT
దర్శకరత్న దాసరి నారాయణరావు మరణాన్ని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది. పరిశ్రమకు సంబంధించిన ప్రతీ ఒక్కరు స్పందించారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్ బాలీవుడ్ నుంచి కూడా దాసరి మరణంపై ప్రతిస్పందనలు వచ్చాయి. నేషనల్ మీడియాలో కూడా దాసరి మరణం గురించిన వార్తలు మార్మోగిపోయాయి.

ఇంతగా దాసరి గురించి సినీ పరిశ్రమ స్పందించడానికి కారణం.. ఆయన కేవలం వ్యక్తి కాదు.. ఒక సినీ శక్తి. అలాంటి దాసరి మరణంపై రియాక్ట్ అయ్యేందుకు అలనాటి అందాల తార శ్రీదేవి తీరిక లేకపోయింది. దాసరి దర్శకత్వంలో రూపొందిన ప్రేమాభిషేకం.. బొబ్బిలిపులి వంటి పలు చిత్రాల్లో నటించింది శ్రీదేవి. ఆమె బాలీవుడ్ లో అంతటి విజయ బావుటా ఎగరేసేందుకు ముందు ఇక్కడి పునాదులు గట్టిగా పడ్డమే.. ఆమె విజయానికి కారణం. అయినా ఆ విషయాన్ని పట్టించుకోని శ్రీదేవి.. దాసరి మరణంపై చిన్నపాటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు.

కనీసం ఆయనకు నివాళి.. కుటుంబానికి సానుభూతి లాంటివేమీ రాలేదు. ఒక ట్వీట్ పెట్టే తీరిక కూడా ఆమెకు లేకపోయింది. రోజంతా తన రాబోయే చిత్రం మామ్ గురించి పోస్టింగులు చేసేందుకు.. రిప్లైలు ఇచ్చేందుకు తీరుబాటు ఉంది కానీ.. దాసరిని గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణమైన విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News