సుధీర్ బాబు.. ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను జీ 5 వారు ఈ కొనుగోలు చేయడం జరిగింది. జీ5 కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు సినిమాను వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ కు జీ5 వారు తేదీని ప్రకటించారు. ఈ సినిమాను దీపావళి సందర్బంగా జీ 5 వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
దీపావళి సందర్బంగా అన్నాత్తే మొదలుకుని పలు సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. వాటితో పాటు దీపావళి సందర్బంగా ఓటీటీ ద్వారా సుదీర్ బాబు సోడా సెంటర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. చిన్న సినిమాలకు కూడా ఈమద్య ఓటీటీ ద్వారా మంచి స్పందన వస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే థియేటర్ల ద్వారా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న శ్రీదేవి సోడా సెంటర్ కు ఖచ్చితంగా ఓటీటీ ద్వారా కూడా మంచి స్పందన వస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
సుధీర్ బాబు పూర్తి మాస్ పాత్రలో ఈ సినిమాలో కనిపించాడు. ఈ కాలంలో కూడా కులాలు మరియు మతాలు అంటూ ఎంతగా కొట్టుకుంటున్నారు అనేది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు కరుణ కుమార్ మరోసారి పలాస వంటి విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో సినిమాను తెరకెక్కించి మెప్పించాడు. సుధీర్ బాబుకు ఒక మంచి సినిమాగా నిలిచిన శ్రీదేవి సోడా సెంటర్ ను ఓటీటీ ద్వారా దీపావళి కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.