స్నేహితురాలికి శ్రీ‌జ కొణిదెల బ‌ర్త్ డే విషెస్

Update: 2022-08-03 15:23 GMT
స‌ర‌దాగా ఒక సాయంత్రం స్నేహితురాలి బ‌ర్త్ డే వేడుక‌ల్లో అలా చిలౌట్ అయితే .. కుటుంబ సభ్యుల‌తో క‌లిసి ఎక్కువ స‌మ‌యం స్పెండ్ చేసే అవ‌కాశం దొరికితే అంత‌కంటే ఏం కావాలి? ఈ బిజీ లైఫ్ ఒత్తిళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఇలాంటివి చాలా చాలా అవ‌స‌రం.

మెగాస్టార్ కుమార్తె శ్రీ‌జ కొణిదెల ఇప్పుడు అలాంటి ఒక ఆహ్లాద‌క‌ర‌మైన సాయంత్రాన్ని ఆస్వాధించారు. త‌న సోద‌రుడు రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి స్నేహితురాలు హారిక కిష‌న్ బ‌ర్త్ డే పార్టీలో సంద‌డి చేసిన ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

చ‌ర‌ణ్ ఈ ఫోటోగ్రాఫ్ లో బ్రాండెడ్ షార్ట్.. బ్లాక్ టీష‌ర్ట్ తో క‌నిపించాడు. వ్యానిటీ ఎయిర్ అన్న టైటిల్ తో ప్రింటెడ్ నెక్ ష‌ర్ట్ ఎంతో ట్రెండీగా క‌నిపిస్తోంది. త‌న‌తో పాటు శ్రీ‌జ కూడా మోడ్ర‌న్ ఔట్ ఫిట్ తో ట్రెండ్ సెట్ట‌ర్ గా క‌నిపించారు. ఆ గ్రూప్ లో బ‌ర్త్ డే గాళ్ హారిక కిష‌న్ కూడా ఉన్నారు. అన్నా చెల్లెళ్ల అపురూప‌మైన బాండింగ్.. స్నేహం ఇలా ఎంతో విలువైన‌వి ఈ ఫోటోలో రీడ‌ర్స్ కి క‌నిపిస్తున్నాయి.

శ్రీ‌జ ఇటీవ‌ల సినీనిర్మాణ రంగంపైనా పూర్తి అవ‌గాహ‌న పెంచుకుంటున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. త‌న సోద‌రుడికి ప్రొడ‌క్ష‌న్ లో అవ‌స‌రం మేర స‌హాయం అందించనున్నార‌ని టాక్ వినిపించింది.

రామ్ చ‌ర‌ణ్ తదుప‌రి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.సి 15లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల చేయ‌నున్నారు. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ త‌ర్వాత చెర్రీ రెట్టించిన ఉత్సాహంతో త‌దుప‌రి సినిమాల‌ను పూర్తి చేస్తున్నారు.
Tags:    

Similar News