అఖండ అప్‌డేట్ : ఒక్క పాత్ర కోసం 40 గెటప్స్ ట్రై చేశారట

Update: 2021-10-01 04:30 GMT
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా లో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. గతంలో బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్‌ సినిమా లో జగపతిబాబు విలన్ గా సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి సూపర్‌ సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా తో శ్రీకాంత్ విలన్ గా తన సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెడుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీకాంత్‌ పై సన్నివేశాల చిత్రీకరణ ముగించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన పాత్ర విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ ఎత్తున అంచనాలున్న అఖండ సినిమాలో తన పాత్ర గురించి శ్రీకాంత్‌ ఇటీవల ఒక చిట్ చాట్‌ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. అఖండ సినిమాలో నా పాత్ర కోసం 40  గెటప్స్ ను ట్రై చేయడం జరిగింది. ముంబయికి చెందిన ప్రముఖ డిజైనర్ మరియు ఆర్టిస్టులను అందుకోసం రంగంలోకి దించారు. 40 గెటప్స్ ను పరిశీలించిన తర్వాత చివరగా ఒక గెటప్‌ ను ఖరారు చేశారు అన్నాడు. సినిమా విడుదల అయ్యే వరకు తన గెటప్‌ ను రివీల్‌ కాకుండా సస్పెన్స్ గా ఉంచాలని దర్శకుడు భావిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు నా లుక్ ను రివీల్‌ చేయలేదు అంటూ శ్రీకాంత్ చెప్పాడు. ఖచ్చితంగా అఖండ సినిమాలో నా పాత్ర ఒక మంచి సెకండ్‌ ఇన్నింగ్స్ బిగినింగ్‌ గా ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. శ్రీకాంత్‌ ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేసి సూపర్‌ హిట్స్ ను దక్కించుకున్నాడు. అలాంటి శ్రీకాంత్‌ ఇప్పుడు విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

అఖండ సినిమాను దసరాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను సంక్రాంతి బరిలో నిలపాలనే నిర్ణయానికి వచ్చారట. బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించింది. ఈ సినిమా నుండి ఇటీవల వచ్చిన మొదటి పాట సూపర్‌ సక్సెస్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్‌ గా అఖండ నిలుస్తుందనే నమ్మకంను ఇప్పటికే బాలయ్య లుక్ ను చూసిన అభిమానులు చెబుతున్నారు. బోయపాటి బాలయ్య సినిమా అంటే ఖచ్చితంగా ఒక సింహా.. ఒక లెజెండ్ రేంజ్ లో ఉంటుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు. అంతటి అంచనాలున్న అఖండ లో శ్రీకాంత్‌ విలన్ అవ్వడం వల్ల ఆసక్తి మరింతగా పెరుగుతున్నాయి.
Tags:    

Similar News