క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సైడ్ విలన్ గా కెరీర్ మొదలుపెట్టి పెళ్ళిసందడి సినిమాతో హీరోగా బ్రేక్ అందుకుని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని మార్కెట్ ని సొంతం చేసుకున్న శ్రీకాంత్ ట్రాక్ రికార్డు ఇప్పుడు ఏ మాత్రం బాగోలేదు. ఒకరు ఇద్దరు సినిమాలు తీసేందుకు ముందుకు వస్తున్నా అవి కనీసం విడుదలకు నోచుకోవడానికి కూడా నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. సరైనోడులో అల్లు అర్జున్ కు బాబాయ్ పాత్రతో కొత్తగా ట్రై చేసినప్పటికీ అలాంటివి మాములు సపోర్టింగ్ రోల్స్ కావడంతో వాటి మీద పెద్ద ఆసక్తి చూపలేదు.
పోనీ విలన్ గా ట్రై చేద్దామని నాగ చైతన్య యుద్ధం శరణంలో రీ ఎంట్రీ ఇస్తే మొదటి ప్రయత్నమే డిజాస్టర్ అయ్యింది. అందుకే ఇక్కడ లాభం లేదని కన్నడలో ఇటీవలే తెరంగేట్రం ఇచ్చాడు శ్రీకాంత్. శాండల్ వుడ్ లో చాలా క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందిన ది విలన్ మొన్న దసరా పండగ సందర్భంగా విడుదలైంది. సీనియర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ - కిచ్చా సుదీప్ కాంబోలో అమి జాక్సన్ హీరొయిన్ గా ప్రేమ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ది విలన్ లో మెయిన్ విలన్ గా చేసింది శ్రీకాంతే. సుదీప్ పాత్రకు ద్రోహం చేసి అతన్ని హత్య చేయాలనుకుని చివరికి అతని చేతిలోనే దారుణంగా చంపబడే పాత్రలో చాలా డిఫరెంట్ గా చేసాడు.
ఎంట్రీ మొదలుకుని ఫస్ట్ హాఫ్ మొత్తం కైజర్ అనే పాత్రలో స్టైలిష్ గా కనిపించే శ్రీకాంత్ సెకండ్ హాఫ్ లో ఒళ్ళంతా కాలిపోయి చాలా వికృతమైన గెటప్ లో ఉంటాడు. కాకపోతే ఇంత కష్టపడినా ది విలన్ బాక్స్ ఆఫీస్ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. అత్యధిక స్క్రీన్లతో కనివిని ఎరుగని స్థాయిలో విడుదలైన ది విలన్ డిజాస్టర్ అయ్యింది. శ్రీకాంత్ కు అక్కడ కూడా ఆశాభంగం తప్పలేదు. శ్రీకాంత్ తన పాత్రకు స్వంతంగా కన్నడలోనే డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. వ్రతమూ చెడింది. ఫలితమూ దక్కలేదు.